బ్రిటన్‌లో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పాస్‌పోర్టును వచ్చే ఏడాది ఫిబ్రవరి 16న రద్దు చేయనున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ రషీద్ అహ్మద్ ప్రకటించారని ఆ దేశ మీడియా జియో న్యూస్ పేర్కొంది.
అవినీతి కేసులో షరీఫ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. అయితే వైద్యసేవల కోసం గతేడాది అక్టోబర్‌లో నాలుగు వారాలు బెయిల్ మంజూరు చేసింది లాహోర్ హైకోర్టు. నవంబర్‌లో లండన్ వెళ్లిన ఆయన ఇప్పటివరకు తిరిగిరాలేదు. ఇటీవలే షరీఫ్‌కు బెయిల్ పొడిగించేందుకు ప్రభుత్వం నిరాకరించింది.
పలుమార్లు సమన్లు పంపించినా ఆయన కోర్టు ఎదుట హాజరు కాకపోవడం వల్ల అల్ అజీజియా, అవెన్‌ఫీల్డ్ గ్రాఫ్ట్ కేసుల్లో నవాజ్ షరీఫ్‌ను నేరస్థుడిగా ప్రకటించింది ఇస్లామాబాద్ హైకోర్టు.
ఇదీ చూడండి: టీకా సరఫరాపై భారత్ సాయం కోరిన నేపాల్