అణు నిరాయుధీకరణ చర్చలు ఎలాంటి పరిష్కారం లేకుండా ముగియడానికి కారణం అమెరికా వైఖరేనని ఉత్తర కొరియా ఆరోపించింది. స్టాక్‌హోంలో జరిగిన చర్చల్లో అమెరికా ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని తెలిపారు ఉత్తర కొరియా ప్రతినిధి కిమ్మ్యాంగ్ గిల్.
"ఈ చర్చలు మాకు సంతృప్తికరంగా సాగలేదు. అందుకే ఎలాంటి పరిష్కారం లేకుండా ముగిశాయి. అమెరికా గతంలో పాటించిన వైఖరినే ఇప్పుడూ అవలంబించటమే ఇందుకు కారణం."
-కిమ్ మ్యాంగ్ లామ్, ఉత్తర కొరియా ప్రతినిధి
స్టాక్ హోంలో అమెరికా దౌత్య ప్రతినిధి స్టీఫెన్ బీగన్తో చర్చించినట్లు లామ్ తెలిపారు. అమెరికా తనకు అనుకూలంగా ఎన్నో ప్రతిపాదించిందనీ.. అందులో తమని సంతృప్తి పరిచే ప్రణాళికలేవీ లేవన్నారు.
ఇదీ చూడండి : పీఓకే కశ్మీరీలు నియంత్రణరేఖ దాటొద్దు: ఇమ్రాన్