మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు మరింత ఉద్ధృతంగా మారుతున్నాయి. ప్రధాన నగరాలైన యాంగూన్, మాండలేలో పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షాపింగ్ మాల్స్ ఎదుట ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. ఆందోళన చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో కవాతు నిర్వహించారు. దీంతో నిరసకారులను చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది గాల్లోకి కాల్పులు జరిపారు. ఓ నిరసనకారుడిని అదుపులోకి తీసుకున్నారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో జలఫిరంగులు సహా భారీగా భద్రతా బలగాలను మోహరించారు సైన్యాధికారులు.
ఆందోళనకారులపై రాళ్ల దాడి
గురువారం.. ప్రజాస్వామ్య ప్రభుత్వానికి మద్దతుగా కొందరు, సైనిక పాలనకు మద్దతుగా మరికొందరు ఆందోళనలకు దిగడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణ నెలకొంది. ఈ క్రమంలో ప్రజాస్వామ్య అనుకూలవాదులపై సైనిక పాలన మద్దతుదారులు విచక్షణరహితంగా రాళ్లు, కర్రలతో దాడి చేశారు.
సూకీ ఇంటి వద్ద ప్రార్థనలు..
సైనిక తిరుగుబాటు మొదలు.. ఇప్పటివరకు ఆంగ్‌సాన్ సూకీ బయట ప్రపంచానికి కనిపించలేదు. దీంతో 50 మంది సూకీ మద్దతుదారులు యాంగూన్‌లోని ఆమె ఇంటి ఎదుట ప్రార్థనలు చేశారు.
ఇవీ చూడండి: