అది ఓ అపార్ట్మెంట్లోని సీసీటీవీ ఫూటేజ్. చైనాకు చెందిన స్థానిక మీడియా గత నెల 26న ఆ వీడియోను యూట్యూబ్‌లో షేర్ చేసింది. అది అప్‌లోడైన కొన్ని నిమిషాలకే వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందించిన నెటిజన్లు.. వీడియోలోని డెలివరీ బాయ్‌ను భేష్ అని మెచ్చుకుంటున్నారు. లిఫ్ట్‌లో చిక్కుకుని ఉన్న కుక్కను కాపాడటమే అందుకు కారణం.
డోర్లు తెరుచుకుని ఉన్న లిఫ్ట్‌లోకి ఓ పెంపుడు కుక్క వెళ్లింది. ఈ క్రమంలో ఆ శునకం మెడకు ఉన్న బెల్ట్ లిఫ్ట్ తలుపుల మధ్య ఇరుక్కుపోయింది. అదే సమయంలో లిఫ్ట్ కిందకి వెళ్లడం వల్ల ఆ బెల్ట్ కుక్క మెడకు బిగుసుకుపోయింది. కింద ఫ్లోర్‌లోనే లిఫ్ట్ కోసం ఎదురుచూస్తున్న డెలివరీ ఏజెంట్‌కు.. లిఫ్ట్ తలుపులు తెరుచుకోగానే మెడకు బెల్ట్ బిగుసుకుపోయి విలవిల్లాడుతున్న కుక్క కనిపించింది. వెంటనే బెల్ట్‌ను తీసేసి డెలివరీ బాయ్ దాని ప్రాణాలు కాపాడాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఆ లిఫ్ట్‌కు ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు డెలివరీ బాయ్ చేసిన పనికి ఫిదా అయ్యారు. ఎలాంటి కంగారు లేని అతని వ్యక్తిత్వం తనకు నచ్చిందని.. ఇటువంటి వ్యక్తుల నుంచి చాలా నేర్చుకోవాలని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
"ఇతను నిజమైన హీరో. అసలు అతను ఎలాంటి కంగారు పడలేదు. ఆ కుక్కను కాపాడినందుకు సంబంధిత యజమాన్లు ఈ డెలివరీ ఏజెంట్‌కు తగిన బహుమానం ఇచ్చారని ఆశిస్తున్నాను. ఒకవేళ ఇవ్వకపోతే మనమే ఓ అకౌంట్ ఓపెన్ చేసి అతనికి బహుమానం అందించాలి" అంటూ మరో నెటిజన్ ప్రశంసించారు.
ఇదీ చూడండి : ప్రపంచంలోనే అతిపెద్ద ఆలుగడ్డ- బరువు 8 కిలోలు!