చైనాలోని అన్హూయ్, సిచాన్ రాష్ట్రాల్లో శుక్రవారం డ్రోన్లతో చేసిన విన్యాసాలు మైమరిపించాయి. 'మిడ్ ఆటమ్' ఫెస్టివల్ సందర్భంగా డ్రోన్ల సమూహంతో, జిగేల్మనిపించే వెలుగులతో ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించారు. చైనా సంప్రదాయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇందుకోసం దాదాపు 300 డ్రోన్లను ఉపయోగించారు. కుందేలు, బుద్ధ భగవాన్ లాంటి అబ్బురపరిచే రూపాలను గాలిలో సృష్టించారు. ఉత్సవంలో పాల్గొన్న వేలాది మంది వీక్షకులు ఈ దృశ్యాలను కనులారా చూసి తరించారు.
ఇదీ చూడండి:'గూగుల్ ఎర్త్'తో 22 ఏళ్ల మిస్టరీ వీడిందిలా!