ETV Bharat / international

మయన్మార్​లో ఆగని పౌర నిరసనలు - సైన్యానికి వ్యతిరేకంగా ఆందోళనలు

మయన్మార్​లో సైనిక పాలనకు వ్యతిరేకంగా చేపడుతున్న పౌర నిరసనలు రెండోవారానికి చేరాయి. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి, నిర్బంధంలోని ఆంగ్​ సాన్​ సూకీని విడుదల చేయాలని డిమాండ్​ చేస్తూ పెద్ద ఎత్తున వీధుల్లోకి చేరి ఆందోళనలు చేపట్టారు ప్రజలు.

demonstrating against the military takeover in Myanmar
మయన్మార్​లో రెండోవారానికి పౌర నిరసనలు
author img

By

Published : Feb 13, 2021, 10:28 AM IST

మయన్మార్​లో సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా.. ఆంక్షలను సైతం లెక్క చేయక పెద్ద సంఖ్యలో ఆందోళనలు చేపట్టారు ప్రజలు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని, నిర్బంధంలో ఉన్న ఆంగ్​ సాన్​ సూకీని విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. సైనిక పాలనకు వ్యతిరేకంగా చేపడుతున్న నిరసనలు రెండోవారానికి చేరాయి.

మయన్మార్​లో రెండోవారానికి పౌర నిరసనలు

మయన్మార్​లో ఆందోళనలను అణచివేసేందుకు నిరసనలపై నిషేధం విధించింది సైన్యం. ఐదుగురి కన్నా ఎక్కువ మంది గుమికూడవద్దని హెచ్చిరించింది. అయినప్పటికీ.. అతిపెద్ద నగరాలైన యాంగూన్​, మాండలేయల్లో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. పరిశ్రమల కార్మికులు, పౌర సేవకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది, ట్రాన్స్​జెండర్లు, బౌద్ధ మత గురువులు, ప్రచారకులు, క్రైస్తవులు ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు.

ఇదీ చూడండి: 'ప్రజాస్వామ్యం కోసం మాతో చేతులు కలపండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.