మయన్మార్- కాచిన్ రాష్ట్రంలోని హాపాకంత్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 123 మంది వరకు మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. జాడే మైనింగ్‌లో కూలీలు పనిచేస్తోన్న సమయంలో ఈ ఘోరం జరిగింది. సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది.. మట్టిదిబ్బల్లో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు.
ఈ ప్రమాదంలో సుమారు 200 మంది ఆచూకీ గల్లంతైనట్లు స్థానిక మీడియా ఓ వెబ్సైట్లో పేర్కొంది.
ప్రపంచంలోనే అతిపెద్ద మైనింగ్..
ప్రపంచంలోనే భారీ, అత్యంత లాభదాయకమైన పరిశ్రమగా జాడే మైనింగ్ పేరొందింది. ఇది దేశంలోని అతి పెద్ద నగరమైన యూంగోన్కు సుమారు 950 కిలోమీటర్ల (600 మైళ్లు) దూరంలో ఉంది. ఇక్కడి కార్మికులంతా ఎలాంటి ఒప్పందం లేకుండా సాధారణ కూలీలుగానే పనిచేస్తూ.. అక్కడే ఉన్న మట్టిదిబ్బల వద్ద జీవనం సాగిస్తున్నారు.
ఇదీ చదవండి: చైనా నిజస్వరూపం బయటపడింది: ట్రంప్