ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ ఈ నెల చివర్లో రష్యా పర్యటన చేయనున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఆహ్వానం మేరకు కిమ్ పర్యటన ఖరారైనట్లు క్రెమ్లిన్ ప్రకటించింది.
ఈ సమావేశంలో అమెరికా-ఉత్తర కొరియాల మధ్య దీర్ఘకాలంగా నెలకొన్న అణ్వాయుధ ప్రతిష్టంభనపై పుతిన్ మధ్యవర్తిగా వ్యవహరించే అవకాశం ఉంది.
ఉత్తర కొరియా సరిహద్దు నగరం వ్లాదివోస్టోక్ నగరంలో కిమ్‌తో పుతిన్ భేటీ కానున్నారని కొన్ని మీడియాలు ప్రచారం చేశాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మూడోసారి సమావేశానికి సుముఖంగా ఉన్నానని గత వారం ప్రకటించారు కిమ్. కానీ ఈ ఏడాది చివరిలోపు పరస్పర అంగీకార ఒప్పందానికి తుది గడువు విధించారు.
సోవియట్ కాలం నుంచి ప్యోంగ్యాంగ్‌తో.. మాస్కో మంచి సంబంధాలు కలిగి ఉంది. ఉత్తర కొరియాలో డజన్ల కొద్ది పరిశ్రమలు, కీలక మౌలిక సదుపాయాల కల్పన, ఆయుధ సామగ్రి వంటివి సమకూర్చింది.