ETV Bharat / international

దక్షిణ కొరియా టీకాపై ఉత్తర కొరియా హ్యాకర్ల కన్ను!

తమ దేశంలోని టీకా సాంకేతికతను దొంగలించేందుకు ఉత్తర కొరియా హ్యాకర్లు ప్రయత్నించారని దక్షిణ కొరియా నిఘా సంస్థ వెల్లడించింది. అయితే... ఫైజర్​ టీకాకు సంబంధించిన సమాచారం అపహరణకు గురైనట్టు ఓ చట్టసభ్యుడు చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చింది.

Korea spy agency: N. Korea hackers targeted vaccine tech
దక్షిణ కొరియా టీకాపై ఉత్తరకొరియా హ్యాకర్లు కన్ను!
author img

By

Published : Feb 17, 2021, 11:43 AM IST

దక్షిణ కొరియాలోని కరోనా వ్యాక్సిన్​, చికిత్సకు సంబంధించిన సాంకేతికతను దొంగలించేందుకు ఉత్తర కొరియా హ్యాకర్లు ప్రయత్నించారు. ఈ విషయాన్ని దక్షిణ కొరియా వెల్లడించింది.

ఏది నిజం?

పార్లమెంట్​కు చెందిన నిఘా కమిటీ సభ్యుడు హా టే-కియుంగ్​.. మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్​ సాంకేతికత కోసం ఉత్తర కొరియా హ్యాకర్లు ఫైజర్​ను లక్ష్యంగా చేసుకున్నారని, ఆ విషయాన్ని నిఘా సంస్థ తనకు స్వయంగా చెప్పిందని ప్రకటించారు.

అయితే హా వ్యాఖ్యలను నిఘా సంస్థ తోసిపుచ్చింది. ఉత్తర కొరియా హ్యాకర్లు టీకా వివరాలను దొంగలించే ప్రయత్నం చేశారని మాత్రమే చెప్పామని.. ఫైజర్​ పేరు ప్రస్తావించలేదని పేర్కొంది.

నిఘా వ్యవస్థ తీరును హా తప్పుపట్టారు. ఫైజర్​ పేరును తాను స్పష్టంగా విన్నానని పేర్కొన్నారు. ఉత్తర కొరియాను ఆగ్రహానికి గురిచేయకుండా ఉండేందుకే ఇలా చేసి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ఉత్తర కొరియా వ్యవహారంపై ఫైజర్​ స్పందించింది. టీకా​ సమాచారం హ్యాక్​ అయ్యిందా? లేదా? అన్నది తెలుసుకునే పనిలో ఉన్నట్టు వెల్లడించింది.

ఇదీ చూడండి:- ఆంక్షలు బేఖాతరు- ఆగని కిమ్ అణు కార్యకలాపాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.