ETV Bharat / international

జపాన్​ ప్రధాని కీలక నిర్ణయం- దిగువ సభ రద్దు

జపాన్​ పార్లమెంట్​లోని దిగువ సభను(japan lower house) రద్దు చేస్తూ.. కీలక నిర్ణయం తీసుకున్నారు ఆ దేశ ప్రధాని ఫుమియో కిషిడా. దీంతో ఈ నెలాఖరున జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు మార్గం సుగమమైంది.

Japan PM
జపాన్​ ప్రధాని
author img

By

Published : Oct 14, 2021, 11:40 AM IST

జపాన్‌ ప్రధానిగా ఇటీవల ఎన్నికైన ఫుమియో కిషిడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటులోని దిగువ సభను రద్దు(japan lower house) చేస్తున్నట్లు ప్రకటించారు. తాజా నిర్ణయంతో అక్టోబరు 31న జపాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరిగేందుకు మార్గం సుగమమైంది. పార్లమెంటు సభ్యుల ఆమోదంతో.. ప్రధాని భాద్యతలు చేపట్టిన 10రోజులకే కిషిడా.. దిగువ సభను రద్దు చేయటం గమనార్హం.

తన పాలనకు ప్రజల ఆమోదం పొందేందుకే ఎన్నికలకు వెళ్తున్నట్లు కిషిడా స్పష్టం చేశారు. ఈ ప్రకటన అనంతరం దిగువ సభను రద్దు చేస్తున్నట్లు దిగువ సభ స్పీకర్‌ తడమొరి ఓషిమా ప్రకటించారు.

2017లో జపాన్‌ సార్వత్రిక ఎన్నికలు జరగ్గా.. అత్యధిక మెజారిటీతో షింజో అబె ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.

ఇదీ చూడండి: డ్రాగన్‌పై దూకుడు... భారత్‌కు మిత్రుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.