ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టంచేశారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలు తమ పంథా మార్చుకోవాలని హితవు పలికారు. రష్యా రాజధాని మాస్కో వేదికగా జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సభ్య దేశాల భేటీలో రాజ్నాథ్ సింగ్ పలు అంశాలపై భారత అభిప్రాయాల్ని పంచుకున్నారు.
సాధారణ విపత్తుల నుంచి అసాధారణ సమస్యల వరకు.... అన్నింటినీ ఎదుర్కోవాలంటే మనకు వ్యవస్థీకృత సామర్థ్యం కావాలి. ఉగ్రవాద ప్రచారం, నిర్మూలనను అరికట్టడానికి ఎస్సీఓ చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక ప్రణాళికను స్వాగతిస్తున్నాం. ఉగ్రవాద నిర్మూలనకు ఎస్సీఓ చేస్తున్న కృషి అభినందనీయం. నమ్మకం, శాంతి, సామరస్యంతోనే ఎస్సీఓ ప్రాంతాన్ని భద్రంగా ఉంచగలం.
- రాజ్నాథ్ సింగ్, భారత రక్షణ మంత్రి
అఫ్గానిస్థాన్లో శాంతిస్థాపన జరగాలని రాజ్నాథ్ ఆకాంక్షించారు. ఇందుకు భారత్ అన్నివిధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలపైనా రాజ్నాథ్ స్పందించారు. విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు.
- ఇదీ చూడండి: బీరుట్లో భయంభయం- మళ్లీ 'అమ్మో'నియం లభ్యం