చైనాను కలవరపెడుతూ... రోజుకు వందలకొద్దీ ప్రాణాలను బలిగొంటున్న కొవిడ్-19 (కరోనా) మహమ్మారిని ఎదుర్కొనేందుకు చైనాకు సాయమందించనుంది భారత్. ఇందులో భాగంగా మాస్క్‌లు, చేతి గ్లౌజులు మొదలైన వైద్య సామగ్రిని చైనాకు పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చైనాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
వుహాన్ ప్రాంతంలోనే అధికంగా...
చైనా-హుబే రాష్ట్రంలోని వుహాన్‌లో కరోనా తాకిడి అధికంగా ఉంది. ఈ ప్రాంతానికి వారం చివర్లోగా వైద్య సామగ్రిని సహాయక విమానం ద్వారా పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. ఆ ఫ్లైట్‌లోనే చైనాలో ఉన్న భారతీయులను పరిమిత సంఖ్యలో తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.
కరోనా తీవ్రరూపం దాల్చింది. ఇప్పటికే ఈ మహమ్మారి దాడికి 1,770 మందికిపైగా మృతి చెందగా.. మరో 70,548 మంది వ్యాధి బారినపడ్డారు.
ఇదీ చదవండి: డ్రైవర్‌కు కారు గిఫ్ట్‌గా ఇచ్చిన యజమాని