ETV Bharat / international

పాక్..​ మిడతల సమస్యపై చర్చిద్దాం: భారత్

మిడతల ముప్పును ఎదుర్కొనేందుకు భారత్-పాక్-ఇరాన్ సమన్వయంతో ముందుకు సాగాలని భారత్​ ప్రతిపాదించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఇరాన్​కు 20 వేల లీటర్ల పురుగుల మందును సరఫరా చేసింది. అలాగే భారత్​-పాక్​ల మధ్య జూన్​ 18న సమావేశం జరపాలని ప్రతిపాదించింది.

India-Pak technical-level meeting on locust issue proposed for June 18
పాక్​ మిడతల సమస్యపై చర్చిద్దాం: భారత్ ప్రతిపాదన
author img

By

Published : Jun 12, 2020, 12:44 PM IST

పాకిస్థాన్​తో మిడతల సమస్యపై చర్చించేందుకు జూన్​ 18న టెక్నికల్ లెవల్ సమావేశం జరపాలని భారత్​ ప్రతిపాదించింది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

"మిడతల సమస్య నివారణ కోసం ఓ సాంకేతిక స్థాయి సమావేశం నిర్వహించాలని పాకిస్థాన్​కు ప్రతిపాదించాం. అలాగే ఉమ్మడిగా మిడతల నియంత్రణ కార్యకలాపాలు చేపట్టాలని, పురుగుల మందు సరఫరా సులభతరం చేయగలమని ప్రతిపాదన చేశాం. అయితే పాకిస్థాన్​ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కానీ జూన్​ 18న ఇరుదేశాల మధ్య టెక్నికల్ లెవల్ సమావేశం జరిగే అవకాశముంది."

- అనురాగ్ శ్రీవాత్సవ, భారత విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి

ఇరాన్​కు సాయం

మిడతలను నియంత్రించే విషయంలో, ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించేందుకు భారత్​ కృషి చేస్తోందని అనురాగ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఇందులో భాగంగా భారత్​... 20,000 లీటర్ల పురుగుల మందును ఇరాన్​కు పంపించినట్లు స్పష్టం చేశారు. ఈ పురుగుల మందు జూన్​ 15 నాటికి ఇరాన్​లోని చాబహార్ నౌకాశ్రయాన్ని చేరుకుంటుందని ఆయన వెల్లడించారు.

ఉపఖండంలో ఎడారి మిడతల దాడులు భయంకరంగా పెరిగిపోతున్నాయి. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు భారత్-పాక్-ఇరాన్ సమన్వయంతో ముందుకు సాగాలని భారత్ ప్రతిపాదించింది.

ఇమ్రాన్ అంత లేదు మీకు?

కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారత్​కు తమ అనుభవాలను అందిస్తామని పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్ చేసిన వ్యాఖ్యలను భారత్ తిప్పికొట్టింది. భారత ప్రభుత్వం అందించిన రూ.20 లక్షల కోట్ల ఆత్మ నిర్భర్ ప్యాకేజీ.. పాకిస్థాన్​ జీడీపీ కంటే ఎక్కువని గుర్తు చేసింది.

ఇంతకు ముందు ఇమ్రాన్​ఖాన్ భారత్​కు ఉచిత సలహాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. తమ ప్రభుత్వం పేదల కోసం చేపట్టిన నగదు బదిలీ పథకం విజయవంతమైందని చెప్పుకొచ్చారు. పేదరికంతో పోరాడుతున్న భారత్​కు తమ నగదు బదిలీ పథకం గురించి వివరిస్తానంటూ ట్విట్టర్ వేదికగా ప్రతిపాదించారు. దీనిని భారత్ సున్నితంగా తోసిపుచ్చింది.

ఇదీ చూడండి: పూర్తి వేతనాలు చెల్లించని కంపెనీలపై చర్యలొద్దు: సుప్రీం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.