ETV Bharat / international

ఐరాస: విద్వేషం, ఉగ్రవాద భాషణం.. ఇమ్రాన్​ ప్రసంగం - ఇమ్రాన్​ ఖాన్​ ప్రసంగం

విద్వేషం, ఉగ్రవాద భాషణం, వ్యక్తిగత దూషణల పర్వం.. ఇది పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్ ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రసంగించిన తీరు. భారత ప్రధాని నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా దూషిస్తూ.. కశ్మీర్​లో హింస తప్పదంటూ ప్రత్యక్ష హెచ్చరికలకు దిగారు ఇమ్రాన్​ ఖాన్.

ఐరాస: విద్వేషం, ఉగ్రవాద భాషణం.. ఇమ్రాన్​ ప్రసంగం
author img

By

Published : Sep 28, 2019, 5:12 AM IST

Updated : Oct 2, 2019, 7:27 AM IST

ఐరాస: విద్వేషం, ఉగ్రవాద భాషణం.. ఇమ్రాన్​ ప్రసంగం

పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ మరోసారి భారత్​పై అక్కసును వెళ్లగక్కారు. భారత ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. ప్రధాని హోదాను మరిచి ఐక్యరాజ్యసమితి 74వ సర్వసభ్యసమావేశంలో విద్వేషభరితంగా ప్రసంగించారు. కశ్మీర్​లో ముస్లింలు ఉగ్రవాదం వైపు మళ్లే అవకాశం ఉందంటూ తమ అసలు రంగు బయటపెట్టుకున్నారు.

ఐరాస సర్వసభ్య ప్రతినిధుల సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించిన తర్వాత ఇమ్రాన్​ దాదాపు 50 నిమిషాలు మాట్లాడారు. 15 నిమిషాల సమయం ఇవ్వగా సుదీర్ఘంగా ఉపన్యసించారు. ప్రధాని పదవి చేపట్టాక ఐరాసలో ఇమ్రాన్​ ఖాన్​ చేసిన తొలి ప్రసంగం ఇదే. ఇందులో సగ భాగం కశ్మీర్​పైనే మాట్లాడారు.

కశ్మీర్​లో అమానవీయ కర్ఫ్యూ విధించారని, దాన్ని ఎత్తివేయాలని, నిర్బంధంలో ఉన్నవారిని విడుదల చేయాలని భారత్​ను డిమాండ్​ చేశారు. ఇరుగుపొరుగున ఉన్న అణ్వాయుధ దేశాల మధ్య ఘర్షణ మంచిదికాదని.. మరోమారు యుద్ధభాషణ చేశారు. దీని పరిణామాలు సరిహద్దులను దాటి ఉంటాయని హెచ్చరించారు. కశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి కల్పించాలని.. ఇది ఐరాస ముందు ఉన్న అతిపెద్ద సవాలు అన్నారు.

మోదీపై విమర్శలు...

ఇమ్రాన్​ తన ప్రసంగంలో ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇరు దేశాల సమస్యలపై చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నా.. మోదీ అంగీకరించడం లేదని ఆరోపించారు. పుల్వామా దుర్ఘటనకు తమని బాధ్యులను చేశారని ఆరోపించారు. ఆధారాలు అడిగితే తమపై బాంబులు వేశారన్నారు. అందుకు దీటుగా తాము బదులిచ్చామన్నారు.

"ఉద్రిక్తతలు పెంచకూడదన్న ఉద్దేశంతో మేము భారత పైలట్​ను విడుదల చేశాం. కానీ మోదీ ఎన్నికల్లో పుల్వామా దాడినే ప్రధాన అంశంగా ప్రచారం చేశారు. 350 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ప్రచారం చేసుకున్నారు. నిజానికి 10 చెట్లను మాత్రమే కూలదోశారు. అక్కడ మళ్లీ మొక్కలను పెంచుకున్నాం. ఇది ట్రైలరే.. అసలు సినిమా ఇంకా మొదలు కాలేదని మోదీ అన్నారు. ఇది ఎన్నికల ఎత్తుగడ అని మేం అనుకున్నాం.

కానీ వారి అసలు అజెండా ఆగస్టు 5న బహిర్గతమైంది. కశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కలిగించిన అన్ని చట్టాలను రద్దు చేశారు. అక్కడికి అదనంగా 1.80 లక్షల భద్రతా సిబ్బందిని మోహరించారు. మొత్తం అక్కడ 9 లక్షల మంది జవాన్లు ఉన్నారు. 80 లక్షల మంది ప్రజలను కర్ఫ్యూలో ఉంచారు." - ఇమ్రాన్​ ఖాన్, పాకిస్థాన్ ప్రధాని

ఆర్​ఎస్​ఎస్​పైనా...

ఆర్​ఎస్​ఎస్​పైనా ఇమ్రాన్​ ఖాన్​ తీవ్ర ఆరోపణలు చేశారు. హిట్లర్​, ముస్సోలినీలను ఆదర్శంగా తీసుకున్న సంస్థ ఆర్​ఎస్​ఎస్​ అని వ్యాఖ్యానించారు.

కశ్మీర్​లో రక్తపాతం...

కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాత కశ్మీర్​లో ప్రజలు మౌనంగా ఉంటారని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు పాక్ ప్రధాని. ప్రజలు బయటకు వస్తే రక్తపాతం జరుగుతుందని హెచ్చరించారు. కశ్మీరీ యువకులు ఉగ్రవాదం వైపు వెళతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

New York (USA), Sep 27 (ANI): While addressing at the 74th United Nations General Assembly (UNGA) in New York on September 27, Prime Minister Narendra Modi said, "The world's largest democracy voted for my government and me. We came back to power with a bigger majority and because of this mandate I am here today." "When a developing nation successfully carries out the biggest cleanliness drive of the world and provides more than 11 crore toilets to its people just within five years, that system gives a message of inspiration to the entire world," PM Modi added.
Last Updated : Oct 2, 2019, 7:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.