ETV Bharat / international

దుబాయ్​లో భారత యుద్ధ విమానాల విన్యాసాలు - dubai news today

దుబాయ్ ఎయిర్​ షోలో భారత వాయుసేనకు చెందిన సూర్యకిరణ్ బృందం, తేజస్ యుద్ధ విమానాల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దుబాయ్ వైమానిక దళం యుద్ధ విమానాలతో కలిసి అక్కడి బుర్జ్ ఖలీఫా వంటి ప్రసిద్ధ ప్రాంతాలపై ఫ్లైపాస్ట్ నిర్వహించాయి.

IAF-suryakirans-tejas-main-attractions-at-dubais-air-show
దుబాయ్ ఎయిర్ షో 2021
author img

By

Published : Nov 18, 2021, 9:04 PM IST

భారత వాయుసేనకు చెందిన సూర్యకిరణ్​ బృందం, తేజస్ యుద్ధ విమానాలు దుబాయ్ ఎయిర్​ షో-2021లో అద్భుత విన్యాసాలతో అబ్బురపరిచాయి. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో సూర్యకిరణ్ ఏరోబాటిక్స్ బృందం.. తొమ్మిది హాక్ 132 యుద్ధ విమానాలతో.. దుబాయ్ యుద్ధవిమానాలు ఏర్​మచ్చీ ఎంబీ-339తో కలిసి ప్రయాణించింది. బుర్జ్ ఖలీఫా, పాల్మ్ జుమేరా, బుర్జ్ అల్ అరబ్​ వంటి ప్రిసిద్ధ ప్రాంతాలపై ఈ ప్లైపాస్ట్ నిర్వహించారు. ఈ మేరకు ఐఏఎఫ్ ప్రకటన విడుదల చేసింది. సూర్యకిరణ్​ బృందం విన్యాసాలు స్థానికులను విశేషంగా అలరించినట్లు పేర్కొంది.

IAF-suryakirans-tejas-main-attractions-at-dubais-air-show
ఎయిర్​షోలో సూర్యకిరణ్ బృందంలోని 9 హాక్ 132 యుద్ధ విమానాలు, దుబాయ్ వాయుసేనకు చెందిన ఏర్మచ్చి ఎంబీ-339 యుద్ధవిమానాలు​

తేజస్ యుద్ధవిమానాలు కూడా ఎప్పటిలాగే ఈ ఎయిర్​షోలో హైలైట్​గా నిలిచాయి. మెరుపువేగం, విభిన్న ప్రత్యేకలతో ఈ ఎయిర్​క్రాఫ్ట్ చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి.

దుబాయ్ ఏర్మచ్చి యుద్ధ విమానాలోత కలిసి భారత హాక్ యుద్ధ విమానాలతో సూర్యకిరణ్​ బృందం విన్యాసాలు

దుబాయ్ ఎయిర్​ షో అల్ మక్తౌమ్​ ఎయిర్​పోర్టులో ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రదర్శనకు ఆదరణ ఉంది. ఈ నెల​ 18 వరకు ఈ షో సాగనుంది.

ఎయిర్ షోలో భారత వాయుసేనకు చెందిన తేజస్ యుద్ధ విమాన విన్యాసం

ఇదీ చదవండి: రేపిస్టులకు ఇక లైంగిక సామర్థ్యం ఖతం- బిల్లుకు పార్లమెంటు ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.