హాంకాంగ్‌లో రోజు రోజుకు నిరసనకారుల ఆందోళనలు పెరిగిపోతున్నాయి. నేరస్థుల అప్పగింత బిల్లుకు వ్యతిరేకంగా 9 వారాల క్రితం మొదలైన ఆందోళనలు మంగళవారం తీవ్రరూపం దాల్చాయి. సాధారణంగా శని, ఆదివారాల్లో మాత్రమే నిరసనల్లో పాల్గొంటారు హాంకాంగ్ వాసులు. కానీ, మంగళవారం సైతం రహదారులపైకి వచ్చారు. రాత్రివరకు నిరసన కార్యక్రమాలు కొనసాగించారు. పోలీస్ స్టేషన్లను కూడా ముట్టడించారు.
చైనా మద్దతుదారులు ఎక్కువగా ఉండే ప్రాంతంలోకి ప్రవేశించారు నిరసన కారులు. కొందరు పొడవాటి కర్రలతో ఆందోళనకారులపై దాడికి దిగడం వల్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక లాభం లేక పోలీసులు నిరసనకారులపైకి బాష్పవాయవు గోళాలు, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. 148 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
ఇదీ చూడండి:తీవ్ర నీటి సంక్షోభం దిశగా భారత్..