హాంకాంగ్‌లో ఆదివారం రాత్రి ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఆందోళనకారులు నిరసనలు చేస్తుండగా.. జిల్లా కౌన్సిలర్‌పై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు ఓ ఆగంతకుడు. కౌన్సిలర్ చెవి, మెడభాగంపై తీవ్ర గాయాలయ్యాయి.
హాంకాంగ్ చైనాకు చెందుతుంది అంటూ నినాదాలు చేశాడు దుండగుడు. ఇది గమనించిన నిరసనకారులు అతడిని పట్టుకొని చితకబాదారు. ఈ ఘర్షణలో ఆగంతకుడు పలువురిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు.
ఇలా మొదలైంది...
చైనాకు నేరస్థుల అప్పగింత బిల్లును వెనక్కి తీసుకోవాలని ప్రారంభమైన నిరసన.. ఆ నిర్ణయాన్ని డ్రాగన్ దేశం వెనక్కి తీసుకున్నప్పటికీ కొనసాగుతూనే ఉంది. హాంకాంగ్‌లో ప్రత్యక్ష ఎన్నికలు సహా వివిధ సౌకర్యాలను కల్పించాలంటూ నిరసనకారులు తమ గళాలను నూతన దిశగా నడిపిస్తున్నారు.
ఇదీ చూడండి : ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు భారత్-ఇండోనేషియా కృషి