ETV Bharat / international

ఇద్దరికి కరోనా వైరస్- 35 అంతస్తుల భవనం ఖాళీ

హాంకాంగ్​లో ఓ భవనంలో ఇద్దరి వ్యక్తులకు వైరస్ సోకినట్లు తేలింది. ఈ నేపథ్యంలో అక్కడ నివాసముంటున్న వారిని వేరే చోటకు తరలించారు అధికారులు. మరో నలుగురికి వైరస్​ లక్షణాలు కనిపించగా.. వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు.

Hong Kong housing block evacuated after double virus find
ఇద్దరికి కరోనా వైరస్- 35 అంతస్తుల భవనం ఖాళీ
author img

By

Published : Feb 11, 2020, 2:24 PM IST

Updated : Feb 29, 2020, 11:48 PM IST

ఇద్దరికి కరోనా వైరస్- 35 అంతస్తుల భవనం ఖాళీ

హాంకాంగ్​ సింగ్​ యీ జిల్లాలోని 35 అంతస్తుల భవనంలో నివాసముంటున్న ఇద్దరి వ్యక్తులకు వైద్య పరీక్షల్లో కరోనా వైరస్ సోకినట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఆ భవనం మొత్తాన్ని ఖాళీ చేయించారు.

సుమారు 3000వేల మంది నివాసముంటున్న ఈ భవనంలో ఎవరి నుంచి వ్యాపించిందో తెలుసుకునేందుకు వారందరినీ తెల్లవారుజామున ఖాళీ చేయించారు. వేరే ప్రాంతానికి తరలించారు. వీరిలో నలుగురికి వైరస్​ లక్షణాలు కనిపించగా.. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు ఆరోగ్య కార్యదర్శి సోఫియా టాన్​ తెలిపారు.

నేను నా కుమారుడు, కోడలు, మనవరాళ్లు, నా భర్తతో కలిసి జీవిస్తున్నాను. మాకు కావాల్సిన ముసుగులు లేవు కాబట్టి ఎక్కువగా బయటకు వెళ్లలేదు. నా మనవరాళ్లను హాలులో ఆడుకోవడానికి కూడా నేను అనుమతించలేను. ఇక ఇప్పుడైతే ఇంట్లోనే ఉండలేము.

-చాన్​, స్థానికురాలు

హాంకాంగ్​లో ఇప్పటివరకు 42 కేసులు నమోదయ్యాయి. వీరిలో 10 కుటుంబాలకు చెందిన వారున్నారు. వీరంతా వైరస్​ సోకిన వ్యక్తితో కలిసి భోజనం చేసినట్లు తెలుస్తోంది.

చైనా నుంచి ఎవరొచ్చినా 14 రోజుల పాటు తప్పనిసరిగా పరిశీలనలో ఉంచనున్నట్లు హాంకాంగ్​ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: ఆప్​ కీ దిల్లీ:​ హ్యాట్రిక్​ దిశగా కేజ్రీ.. మళ్లీ ప్రభంజనం!

Last Updated : Feb 29, 2020, 11:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.