ETV Bharat / international

ట్రాఫిక్​ పోలీసు ఇంట్లో బంగారు మరుగుదొడ్డి - ట్రాఫిక్​ పోలీసుల అవినీతి

ఓ ట్రాఫిక్​ పోలీసు నివాసం బంగారంతో ధగధగా మెరిసిపోయింది. రష్యాలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలతో రంగంలోకి దిగిన దర్యాప్తు బృందాలకు మైండ్​ బ్లాంక్​ అయ్యే దృశ్యాలు కనిపించాయి. సోదాలు నిర్వహిస్తున్న సమయంలో టాయిలెట్​ తెరిచి చూడగా సీటు అంతా పుత్తడితో కట్టి ఉంది. దానిని చూసిన వారు అవాక్కయారు.

Golden Toilet
బంగారు మరుగుదొడ్డి
author img

By

Published : Jul 25, 2021, 5:27 PM IST

రష్యాలో ఓ భారీ స్కాం బయటపడింది. అనేక మంది ట్రాఫిక్​ పోలీస్​ అధికారులు ఇందులో భాగమైనట్లు స్థానిక అధికారులు తెలిపారు. అయితే దర్యాప్తు బృందాలు.. ఓ ఉన్నతాధికారి ఇంటికి సోదాలకు వెళ్లినప్పుడు బయటపడిన కొన్ని దృశ్యాలు అందరిని అవాక్కయ్యేలా చేశాయి. వాటిలో ఒకటి అధికారి ఇంట్లో ఉండే మరుగుదొడ్డి. ఆ వ్యక్తి లావెర్ట్రీ సీట్​ను బంగారంతో కట్టించుకున్నాడు. అంతేగాక దాని ఫ్లోర్​ను కూడా మ్యాచింగ్​గా ఉండేలా ప్రత్యేక మార్బుల్​తో పరిపించాడు. దీనిని చూసిన దర్యాప్తు బృందం ఒక్కసారిగా కంగుతింది. ఆ ట్రాఫిక్​ పోలీస్​ అధికారి పేరు కల్నల్ అలెక్సీ సఫోనోవ్.

ఇల్లంతా బంగారమే..

నైరుతి రష్యాలోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరున్న స్టావ్రోపోల్​లో అలెక్సీకి భూతల స్వర్గాన్ని తలపించే ఇల్లు ఉంది. ఇంటి ముందు రెండు ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇంట్లో ఉండే ఫర్నీచర్​, గోడకు ఉండే ఫ్రేమ్​లు, కిచెన్​లో ఉండే అరమరాలు, మిగతా వస్తువులు, పిల్లలు అడుకునే బొమ్మలు, ఇతర సామాగ్రి అంతా బంగారంతో ధగధగలాడుతున్నాయి. అంతేకాకుండా ఇంటీరీయర్​ డెకరేషన్​ అంతా పుత్తడితోనే ఉండడం గమనార్హం.

యూట్యూబ్​లో వైరల్​ అవుతున్న వీడియో..

దర్యాప్తు బృందం ఆ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో తీసిన వీడియో యూట్యూబ్​లో హల్​చల్​ చేస్తోంది. దీనిని అధికారులు జులై 20న ఆప్​లోడ్​ చేశారు. దీని నిడివి 49 సెకెన్లు. అయితే ఇప్పటివరకు ఈ వీడియోకు 3.45 లక్షల మంది చూశారు. ఇది చూసిన వారంత ప్రస్తుతం రియల్​ఎస్టేట్​ వాళ్లు ఇచ్చే వ్యాపార ప్రకటనలా ఉందని కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోను మీరు చూడడం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కేసు ఏంటి..

ది మాస్కో టైమ్స్ నివేదిక ప్రకారం అలెక్సీ, అతని కింద ఉండే ఆరుగురు అధికారులు పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుని వాహనాలకు ఫేక్​ పర్మిట్లు ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయా వాహనాలు స్టావ్‌పోల్​లో ఎటువంటి రుసుము చెల్లించకుండా సరుకు రవాణా చేయవచ్చు. ఈ క్రమంలో వారు భారీగా అవినీతికి పాల్పడ్డారని కేసు నమోదైంది. అదే కేసులో మరో 35 మంది హస్తం ఉందనే అనుమానులు ఉన్నాయి. ఈ క్రమంలో విచారణ కోసం వెళ్లిన పోలీసులు.. ఆ ఇంటిని చూసి షాక్​ అయ్యారు.

అయితే ఈ ఆరోపణలు రుజువైతే అలెక్సీకి సుమారు 15ఏళ్ల జైలుశిక్ష పడుతుందని స్థానికి మీడియోలో కథనాలు వచ్చాయి.

ఇదీ చూడండి: అంతరిక్ష పర్యటనపై ఆసక్తా? ఇది మీకోసమే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.