కొవిడ్-19 కేసుల సంఖ్య రోజురోజుకు ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కోటి 26 లక్షల 64 వేల 695 మంది మహమ్మారి బారిన పడ్డారు. వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 5 లక్షల 63 వేల 716కు చేరింది. 73 లక్షల 95 వేల 378 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.
దక్షిణ కొరియాలో కొత్త కేసులు..
వైరస్ ప్రభావం తగ్గినట్లు భావిస్తున్న దక్షిణ కొరియాలో కొత్తగా 35 కేసులు నమోదయ్యాయి. అందులో 13 కేసులు వైరస్ వ్యాప్తికి కేంద్ర బిందువైన సియోల్ మెట్రోపాలిటన్ ప్రాంతానికి చెందినవి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 13వేల 373కు చేరింది. ఇప్పటి వరకు మొత్తం 288 మంది మరణించారు.
నేపాల్లో 70 కేసులు..
నేపాల్లో కొత్తగా 70 మంది కరోనా బారినపడ్డారు. మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 16 వేల 719కి చేరింది. వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 38కి పెరిగింది.
కరోనా కారణంగా అత్యంత తీవ్రంగా ప్రభావితమైన అగ్రరాజ్యం అమెరికాలో కేసుల సంఖ్య 33 లక్షలకు చేరువైంది. రోజు రోజుకు ప్రమాదకర స్థాయిలో బాధితులు పెరుగుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు అధికంగా ఉన్న దేశాలు..
దేశం | కేసులు | మరణాలు | |
1 | అమెరికా | 32,93,532 | 1,36,720 |
2 | బ్రెజిల్ | 18,07,496 | 70,601 |
3 | భారత్ | 8,20,916 | 22123 |
4 | రష్యా | 7,20,547 | 11,205 |
5 | పెరు | 3,19,646 | 11,500 |
6 | చిలీ | 3,09,274 | 6,781 |
7 | స్పెయిన్ | 3,00,988 | 28,403 |
8 | మెక్సికో | 2,89,174 | 34,191 |
9 | బ్రిటన్ | 2,88,133 | 44,650 |
10 | ఇరాన్ | 2,55,117 | 12,635 |