సూపర్ బ్లడ్ మూన్ ఏర్పడటానికి ముందు న్యూజిలాండ్‌లో నిండు జాబిల్లి కనువిందు చేసింది. గ్రహణం తర్వాత అరుణ వర్ణంతో చంద్రుడు మెరిసిపోనున్నాడు. 15 నిమిషాల పాటు సూపర్ బ్లడ్ మూన్ కనిపించనుంది.
![Glittering moon rises ahead of super blood moon](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11904806_279_11904806_1622021910357.png)
భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.15 నిమిషాలకు చంద్ర గ్రహణం ప్రారంభమవుతుంది. సాయంత్రం 6.22 గంటల వరకు ఇది కొనసాగుతుంది. ఈ సమయంలో చంద్రుడు ఎరుపు, నారింజ రంగుల్లో కనిపించనున్నాడు. సూర్యుడి ప్రకాశం వల్ల ఈ రంగులు ఏర్పడనున్నాయి. భారత్‌లో ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో చూసే అవకాశం ఉంది.
![Glittering moon rises ahead of super blood moon](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11904806_447_11904806_1622022283489.png)
న్యూజిలాండ్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇతర పసిఫిక్, తూర్పు ఆసియా దేశాలలో సూపర్ బ్లడ్ మూన్‌ను చూసే అవకాశం ఉంది. హవాయీ దీవులు, ఉత్తర అమెరికాల్లోని కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున ఇది కనిపించనుంది. అమెరికా తూర్పు తీర ప్రాంతాలు సహా ఐరోపా, ఆఫ్రికా పశ్చిమాసియా దేశాలు ఈ అద్భుతాన్ని చూసే అవకాశం లేదు.
ఇదీ చదవండి- బాంబులతో దాడి చేసి.. రూ.11లక్షలు చోరీ