ETV Bharat / international

అఫ్గాన్​లో కారు బాంబు పేలుడు - ముగ్గురు మృతి - kabul journalist killed in afghan car bomb

అఫ్గానిస్థాన్​లో కారుబాంబు కలకలం సృష్టించింది. ఈ ఘటనలో మాజీ టీవీ రిపోర్టర్​​తో పాటు మరో ఇద్దరు పౌరులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Former Afghan TV presenter killed in explosion in capital
అఫ్గాన్​లో కారు బాంబు పేలుడు -ముగ్గురు మృతి
author img

By

Published : Nov 7, 2020, 1:08 PM IST

Updated : Nov 7, 2020, 1:16 PM IST

అఫ్గానిస్థాన్​ కాబుల్​కు చెందిన మాజీ రిపోర్టర్​ లక్ష్యంగా శనివారం ఉదయం కారు బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న రిపోర్టర్​తోపాటు, మరో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు కాబుల్​ పోలీసులు తెలిపారు. మరణించిన మాజీ రిపోర్టర్ను యమాసియావాష్​గా గుర్తించామని వివరించారు.పేలుళ్ల వెనుక ఎవరి హస్తం ఉందో తెలియాల్సి ఉందన్నారు. శనివారం జబుల్​ రాష్ట్రంలో జరిగిన మరో పేలుడు ఘటనలో ఏడుగురు వ్యక్తులు గాయపడినట్లు సమాచారం.

గత కొన్ని నెలలుగా అఫ్గాన్​లో మారణకాండ కొనసాగుతూనే ఉంది. ఇటీవల కాబుల్ విశ్వవిద్యాలయంలో జరిగిన పేలుళ్లలో 22మంది విద్యార్థులు మరణించారు. అక్టోబరు24న ఓ క్యాంపస్​లో జరిగిన దాడిలో 24మంది విద్యార్థులు ప్రాణాలొదిలారు.

అఫ్గాన్​ ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య శాంతి చర్చలు జరుగుతున్నా దాడులు మాత్రం ఆగటంలేదు. ఈ చర్చల్లో భాగంగా అమెరికా,నాటో సైన్యాలు దేశం విడిచి వెళ్లాలని తాలిబన్లు డిమాండ్​ చేస్తున్నారు.

ఇదీ చదవండి :కాబుల్​ వర్సిటీలో కాల్పుల కలకలం

Last Updated : Nov 7, 2020, 1:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.