టోక్యో నగరంలో ఓ కేఫ్-బార్‌ను నిర్వహిస్తున్నారు. పేరు నుంచి మొదలై అక్కడ అన్నీ విభిన్నం. తినే ఆహారం, ధరించే దుస్తులు అన్నింటికీ ఒకే పేరు. అంతే కాదండోయ్...ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించే ఆటలు కూడా ఆడిస్తారు.. వింటుంటేనే ఎలా ఉంటుందో అనిపిస్తుంది కదూ.. చూడండి
అవును..సరదా కార్యక్రమాల నిర్వహణలో జపాన్ మొత్తానికి ఇదొక్కటేనని ప్రజలు భావించాలని మా ఆకాంక్ష. నింజాలోకి వచ్చేవారందరికీ ఉత్తేజభరితమైన అనుభవాన్ని ఇచ్చేందుకు మా సిబ్బంది ప్రయత్నిస్తుంది.
_టోమోయ్ అకియామా, వెయిటర్
కేఫ్‌లోని ఆహారం, పానీయాలు నింజా పేరుతోనే ఉంటాయి. నింజా బ్లాక్ జింజర్ అలె, నింజా పాస్తా, నింజా కర్రీ, ఇలా అన్నీ నింజామయమే....అంతే కాదు ఉల్లాసభరితమైన ఆటలూ ఆడిస్తారు.
నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. పానీయాలు అద్భుతంగా ఉన్నాయి. అందరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మేము బాణాలు సంధించే ఆట ఆడాము..అదీ నోటితో నేనెంతో సులభంగా ఆడాను. ఎందుకంటే నేను ట్రంపెట్ వాయిస్తాను కనుక...
_మాక్స్ యూసఫ్, కస్టమర్
ప్రత్యేకమైన, అసాధారణమైన ఇతివృత్తాలతో ఉన్న ఈ సంస్థను హాలిడే జాక్ నిర్వహిస్తున్నారు... ఈ సంవత్సరంలో పిరానా ఫిషింగ్ ఈవెంట్ నిర్వహించిందీ సంస్థ. ఇతర దేశాల రుచులతో వంటల కార్యక్రమాన్ని నిర్వహించనుంది...అలాగే నింజా టూర్ అనే కొత్త కార్యక్రమాన్ని త్వరలో చేపట్టనుంది..
ఇలాంటి కార్యక్రమాల్లో సంస్థని ప్రపంచంలోనే మొదటి స్ధానానికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నామని సంస్థ నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చూడండి:ప్రపంచ వారసత్వ జాబితాలో హిర్కానియన్, వత్నాజోకుల్