ETV Bharat / international

ఆస్ట్రేలియాలో ఎఫ్​బీ న్యూస్​ షేరింగ్​ బంద్ - ఆస్ట్రేలియాలో న్యూస్​ షేరింగ్​ బంద్​ చేసిన ఫేస్​బుక్​

ఆస్ట్రేలియా వినియోగదారులపై కీలక నిర్ణయం తీసుకుంది సామాజిక మాధ్యమం ఫేస్​బుక్​. ఇకపై న్యూస్​ షేరింగ్​కు అనుమతించమని స్పష్టం చేసింది. డబ్బులిచ్చి వార్తలను పొందాలన్న నిబంధన తప్పనిసరి కావడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది.

Facebook blocks Australians users from sharing news
ఆస్ట్రేలియాలో న్యూస్​ షేరింగ్​ బంద్: ఫేస్​బుక్
author img

By

Published : Feb 18, 2021, 10:10 AM IST

ఆస్ట్రేలియాలో న్యూస్​ షేరింగ్​పై నిషేధం విధిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఫేస్​బుక్ ప్రకటించింది. పబ్లిషింగ్ చేసే వారికి సామాజిక మాధ్యమాలు డబ్బులిచ్చి వార్తలు పొందాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో ఫేస్​బుక్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

"ఫేస్​బుక్​కు, పబ్లిషర్లకు మధ్య సన్నిహిత్యాన్ని గుర్తించలేక ఈ చట్టం ప్రవేశపెట్టారు. ఫేస్​బుక్​.. న్యూస్​ కంటెంట్​ను దొంగిలించదు. పబ్లిషర్లే తమ కథనాలను ఫేస్​బుక్​లో షేర్​ చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తారు," అని ఫేస్​బుక్​ ఉపాధ్యక్షుడు కాంప్ బెల్​ బ్రౌన్ తన వ్యక్తిగత బ్లాగ్​లో పేర్కొన్నారు.

న్యూస్​ను షేర్​ చేసే అవకాశం ఆస్ట్రేలియన్లకు కల్పించే రోజు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు బ్రౌన్.

ఆస్ట్రేలియా సెనేట్​లో... జనవరిలో ఈ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా... దీనిని ఆమోదిస్తే న్యూస్​ షేరింగ్​ నిలిపివేస్తామని ఫేస్​బుక్ తేల్చి చెప్పింది.

ఇదీ చదవండి:మలాలాకు తాలిబన్​ ఉగ్రవాది బెదిరింపులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.