ETV Bharat / international

"ఎఫ్​-16ను భారత్​ కూల్చలేదు" - pak f-16

పాక్​ ఎఫ్​-16 యుద్ధ విమానాన్ని కూల్చామన్న భారత ప్రకటనలు నిరాధారమని దాయాది దేశం కొట్టిపారేసింది. కేవలం రాజకీయ లబ్ధి కోసమే భారత ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించింది.

ఎఫ్​-16ను భారత్​ కూల్చలేదు
author img

By

Published : Mar 11, 2019, 12:15 PM IST

ఎఫ్​-16 యుద్ధ విమానంపై పాక్​ బుకాయింపు మానలేదు. తమ ఎఫ్​-16 యుద్ధ విమానాన్ని భారత వైమానిక దళం కూల్చివేసిందన్న వార్తలను మరోసారి కొట్టి పారేసింది. ఎఫ్​-16 విమానంపై భారత ప్రభుత్వం ఏ ఆధారాలు చూపడం లేదని ఆరోపించింది.

భారత వైమానిక దళం 'మిగ్​-21 బైసన్'​తో పాక్​ 'ఎఫ్​-16' విమానాన్ని కూల్చిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్​ కుమార్​ ప్రకటించారు. ఈ ప్రకటనను పాక్​ ఖండించింది. పుల్వామా ఉగ్రదాడిలో పాక్​ హస్తముందన్న భారత్ వాదనలనూ తోసిపుచ్చింది.

" ఎఫ్​-16 యుద్ధ విమానాన్ని మిగ్​-21తో కూల్చామన్న భారత్ ప్రకటనలు నిరాధారమైనవి. భారత ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఒకదాని తర్వాత మరొకటి అసత్యాలను ప్రచారం చేస్తోంది. రాజకీయ లబ్ధి కోసమే ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. "
- పాక్ విదేశాంగ శాఖ

ఇదీ చూడండి:'పాక్​ జెట్​ను కూల్చింది అభినందనుడే'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.