కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి రద్దు సహా పౌరసత్వ చట్ట సవరణ విషాయాల్లో భారత ప్రభుత్వ నిర్ణయాన్ని మాల్దీవులు సమర్థించింది. ఈ రెండు అంశాలు నూటికి నూరు శాతం భారత అంతర్గత విషయాలని తేల్చిచెప్పారు ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్. 'ఈటీవీ భారత్' ప్రత్యేక ముఖాముఖిలో భారత్-మాల్దీవుల సంబంధాలపైనా పలు కీలక వ్యాఖ్యలు చేశారు షాహిద్.
కశ్మీర్ అంశం పూర్తిగా భారత అంతర్గత విషయమని.. ఇందులో తమతో సహా ఏ ఇతర దేశాలు జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదన్నారు షాహిద్. ఇటీవల జమ్ముకశ్మీర్‌ను సందర్శించిన విదేశీ రాయబారుల్లో షాహిద్ ఒకరు. కశ్మీర్లో ప్రస్తుత క్షేత్ర పరిస్థితులపై షాహిద్ సంతృప్తి వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం సమర్థంగా వ్యవహరిస్తుందని అభిప్రాయపడ్డారు.
భారత విదేశాంగ మంత్రి జయ్‌శంకర్‌తో ఇరు దేశాల సంబంధాలపై దిల్లీలో కీలక చర్చలు జరిపినట్లు తెలిపారు. సీఏఏపై భారత్‌లో జరుగుతోన్న నిరసనలపై.. స్పందిస్తూ ఇది భారత మౌలిక సూత్రం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా అభివర్ణించారు.
భారత్ మద్దతుతో మాల్దీవులలో క్రికెట్ మైదానం నిర్మాణం అవుతుందని.. ఒకసారి ఇది పూర్తయితే తాము.. టీమిండియాను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి: రాజ బిరుదులకు దూరంగా ప్రిన్స్ హ్యారీ దంపతులు