ETV Bharat / international

'శాంతి'కి ప్రపంచ దేశాల సంపూర్ణ మద్దతు - Pak welcomes US-Taliban deal; says would support every effort to bring peace in Afghanistan

అమెరికా-తాలిబన్ల మధ్య కుదిరిన శాంతి ఒప్పందంపై ప్రపంచ దేశాలు, వివిధ అంతర్జాతీయ సంస్థలు స్పందించాయి. ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని స్వాగతించిన ఆయా పార్టీలు.. సుస్థిర శాంతికి బీజం పడిందని వ్యాఖ్యానించాయి. అఫ్గాన్​ ప్రజలు కన్న కలలు నిజమయ్యేలా, వారి ప్రయోజనాలు పరిరక్షించేలా అక్కడి ప్రభుత్వానికి, ప్రజలకు భారత్​ సహకారం ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేసింది విదేశాంగ శాఖ. ఒప్పందంతో హింస తగ్గి... సుస్థిర శాంతి నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్​.

EU: US-Taliban deal is first step to Afghanistan peace process
'శాంతి'కి ప్రపంచ దేశాల సంపూర్ణ మద్దతు
author img

By

Published : Mar 1, 2020, 5:52 AM IST

Updated : Mar 3, 2020, 12:47 AM IST

దశాబ్దాలుగా యుద్ధంతో అతలాకుతలమైన అఫ్గానిస్థాన్​లో శాంతిని నెలకొల్పే ఉద్దేశంతో అమెరికా, తాలిబన్ల మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఖతార్​లోని దోహాలో జరిగిన కార్యక్రమంలో ఇరు పక్షాల ప్రతినిధులు సంతకాలు చేశారు. భారత్​ సహా ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ సంస్థలు ఈ ఒప్పందాన్ని స్వాగతించాయి.

ఎవరెవరు ఏమన్నారంటే..

ఉగ్రవాదాన్ని, హింసను అంతమొందించి శాంతి-సుస్థిరతలను అఫ్గానిస్థాన్​లో నెలకొల్పే అవకాశాలన్నింటికీ మద్దతు ఇవ్వాలనేదే తమ విధానమని స్పష్టం చేసింది భారత్​. ఈ మేరకు ఒప్పందాన్ని స్వాగతించారు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్​ కుమార్​.

అమెరికా-తాలిబన్ల శాంతి ఒప్పందంతో భారతదేశ భద్రత, ఇతరత్రా ప్రయోజనాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూడాలని కోరింది కాంగ్రెస్​ పార్టీ.

ఈ అవకాశం వదులుకోవద్దు: ఈయూ

శాంతి ప్రక్రియలో అమెరికా-తాలిబన్​ ఒప్పందం తొలి అడుగని పేర్కొంది ఐరోపా సమాఖ్య(ఈయూ). శాంతి నెలకొల్పే దిశగా వచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని వదులుకోవద్దని ఓ ప్రకటనలో తెలిపారు ఈయూ విదేశాంగ విభాగ చీఫ్​ జోసెఫ్​ బోరెల్​.

ఒప్పందం ఆహ్వానించదగినది: పాక్​

శాంతి ఒప్పందాన్ని స్వాగతించిన దాయాది పాకిస్థాన్​.. అఫ్గాన్​లో శాంతి కోసం జరిగే ప్రయత్నాలన్నింటికీ మద్దతు కొనసాగిస్తామని తెలిపింది. అఫ్గాన్​కే కాకుండా ప్రాంతీయంగా ఈ ఒప్పందం ఎంతో విలువైందని ఆ దేశ విదేశాంగ శాఖ పేర్కొంది. శాంతియుత అఫ్గాన్​ కోసం పాక్​ తన వంతు బాధ్యత నిర్వర్తించిందని స్పష్టం చేసింది.

సుస్థిర శాంతికి తొలి అడుగు: నాటో

సుస్థిర శాంతి దిశగా ఈ ఒప్పందం చాలా ముఖ్యమైన తొలి అడుగు అని నాటో కూటమి ప్రధాన కార్యదర్శి జెన్స్​ స్టోలెన్​బర్గ్​ చెప్పారు. ఒప్పందానికి గౌరవ సూచికంగా శనివారం అన్నిరకాల దాడులను నిలిపివేశామని తాలిబన్లు అంతకుముందు తెలిపారు.

ఆహ్వానించిన ఐరాస

శాంతి ఒప్పందాన్ని ఐక్యరాజ్యసమితి ఆహ్వానించింది. హింస తగ్గి, అఫ్గాన్​ ప్రజలందరూ ఈ ఒప్పందంతో లబ్ధి పొందుతారని ఐరాస సెక్రటరీ జనరల్​ ఆంటోనియో గుటెరస్​ పేర్కొన్నారు.

అఫ్గాన్​ ప్రజల మిశ్రమ స్పందన

చరిత్రాత్మక ఒప్పందంపై అఫ్గాన్​ ప్రజలు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా తీవ్రస్థాయిలో రక్తపాతాన్ని చూసిన తాము ఇకపై ఇంకేం చూడాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ప్రస్తుత పరిణామాలు ఉపయోగపడేలా ఉన్నాయని జహ్రా హుస్సేనీ అనే ఓ ఉద్యమకారిణి చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ప్రజలు ఆనందోత్సాహాలతో కనిపించారు.

Last Updated : Mar 3, 2020, 12:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.