ETV Bharat / international

మాస్కు ధరించకపోతే.. గోతులు తవ్వాల్సిందే

ఇండోనేసియాలోని జావాలో మాస్క్​లు ధరించకుండా బయటకు వచ్చే వారిని వినూత్నంగా శిక్షిస్తున్నారు అక్కడి అధికారులు. మాస్క్​లు లేని వారికి గోతులు తవ్వే శిక్షను విధిస్తున్నారు. కొవిడ్ కారణంగా మరణించిన వారి మృతదేహాలను పూడ్చటానికి వీటిని ఉపయోగిస్తున్నారు.

Digging Graves for Covid-19 Victims
మాస్కు ధరించకపోతే.. గోతులు తవ్వాల్సిందే
author img

By

Published : Sep 16, 2020, 11:54 AM IST

కొవిడ్‌ నిబంధనలు ఉల్లఘించినందుకు ఇండేనేసియాలోని జావాకు చెందిన అధికారులు వినూత్నంగా శిక్షలు అమలు చేస్తున్నారు. జనసంచారం ఉన్న చోట మాస్కులు ధరించకుండా తిరిగిన వారికి గోతులు తవ్వే శిక్షను విధిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో కొవిడ్‌ బారిన పడి మృతిచెందిన వారిని పూడ్చడానికి అవసరమైన గోతులను వీరితో తీయిస్తున్నారు.

తూర్పు జావా గ్రేసిక్‌ రీజెన్సీ ప్రాంతానికి చెందిన ఎనిమిది మంది వ్యక్తులకు అక్కడి అధికారులు ఇటీవల ఈ శిక్షను అమలు చేశారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం కరోనా రోగులు చనిపోతే గోతులు తవ్వడానికి ముగ్గురు వ్యక్తులే ఉన్నారు. దీంతో వినూత్నంగా అలోచించిన అధికారులు.. నిబంధనలను అతిక్రమించిన వారిని ఆ ముగ్గురికి జతగా పని చేసే శిక్ష విధించారు.

ఈ ఎనిమిది మందిలో ఇద్దరు గుంత తీయడానికి.. ఒకరు వీరితో గుంత తీయించటానికి, మిగిలిన అయిదుగురు మృతదేహం ఉన్న చెక్కపెట్టెను గుంతలో పూడ్చిపెట్టేలా ఆదేశించారు. దీంతో ప్రజలు ఈ శిక్షకు భయపడి కొవిడ్‌ నిబంధనలు పాటించటానికి ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇండోనేసియాలో ఇప్పటి వరకూ 2,18,382 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 8723 మంది చనిపోయారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.