ETV Bharat / international

Delta variant: కొవిడ్​ కంటే 1000 రెట్లు వైరల్​ లోడ్​ - china scientisits study on delta varinat

కరోనా డెల్టా వేరియంట్​ కేవలం వేగంగా వ్యాప్తి చెందడమే కాదు, మనిషి శరీరంలో చాలా త్వరగా వృద్ధి చెందుతోందని ఓ అధ్యయనంలో తేలింది. ఈ వేరియంట్​ కారణంగా 2019-2020లో వచ్చిన కొవిడ్‌ వైరస్‌ కంటే 1000 రెట్లు ఎక్కువగా మనిషి శరీరంలో ఇప్పుడు వైరల్‌ లోడ్‌ కనిపిస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు.

Delta variant
డెల్టా వేరియంట్
author img

By

Published : Jul 9, 2021, 9:56 PM IST

Updated : Jul 9, 2021, 10:43 PM IST

కరోనా డెల్టా వేరియంట్‌ ప్రపంచవ్యాప్తంగా ఎందుకింత ఉద్ధృతిని చూపిస్తోందో వివరించే కొత్త అధ్యయనం వెలుగు చూసింది. డెల్టా వైరస్‌ కేవలం వేగంగా వ్యాప్తి చెందడమే కాదు, మనిషి శరీరంలో చాలా త్వరగా వృద్ధి చెందుతోందని ఇది తెలియజేస్తోంది. మొదట 2019-20లో సోకిన కొవిడ్‌ వైరస్‌ కంటే ఇది దాదాపు 225 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆ అధ్యయనం చెప్పింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్‌ చాలా దేశాలను హడలెత్తిస్తోంది.

చైనాలోని 'గ్వాంగ్‌జాంగ్‌ ప్రొవిన్షియల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రిపెవన్షన్‌' సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం డెల్టా వేరియంట్‌ శ్వాసవ్యవస్థలో చాలా వేగంగా వృద్ధి చెందుతోందని తేలింది. అంతేకాదు, రోగుల్లో చాలా ఎక్కువగా వైరల్‌ లోడ్‌ కూడా కనిపిస్తోంది. మొదట్లో 2020లో వచ్చిన కొవిడ్‌ వైరస్‌ కంటే 1000 రెట్లు ఎక్కువగా మనిషి శరీరంలో ఇప్పుడు వైరల్‌ లోడ్‌ కనిపిస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. డెల్టా వేరియంట్‌ సోకినవారిలో చాలా తొందరగా రోగ లక్షణాలు కనిపిస్తున్నాయి. కొవిడ్‌ మొదటి దశలో రోగ లక్షణాలు కనిపించాలంటే ఆరు రోజులు పట్టేదని, ఇప్పుడు కేవలం నాలుగైదు రోజుల్లోనే వైరల్‌ లోడ్‌ తీవ్ర స్థాయికి చేరుతోందని పరిశోధకులు కనుగొన్నారు.

అధ్యయనం ఎలా జరిగింది?

2021లో మొదట డెల్టా వేరియంట్‌ కేసులు చైనాలోని గ్వాంగ్‌ఝౌలో మే నెలలో నమోదయ్యాయి. మే21 నుంచి జూన్‌ 18 మధ్య నమోదైన 62 మంది రోగుల నుంచి శాస్త్రవేత్తలు శాంపిల్స్‌ సేకరించారు. 2020లో కొవిడ్‌ బారిన పడ్డ 63 మంది రోగుల డాటాతో వీటిని పోల్చి చూశారు. డెల్టా వేరియంట్‌ బారిన పడ్డవారు చాలా తొందరగా వ్యాధిని వ్యాప్తి చేస్తున్నట్లు తేలింది. అంతేకాదు, డెల్టా వేరియంట్‌లో వైరస్‌ను మనిషి శరీరంలో 4వ రోజున మొదటిసారి గుర్తించినప్పుడు ఉన్న వైరస్‌లోడు, 19ఎ, 19బి స్ట్రెయిన్లతో పోల్చితే 1000 రెట్లు అధికంగా ఉందని తేల్చారు.

ఇదీ చూడండి: జికా వైరస్​పై కేంద్రం హైఅలర్ట్- ప్రత్యేక బృందంతో...

ఇదీ చూడండి: 'లామ్డా' వేరియంట్​పై కేంద్రం కీలక ప్రకటన

Last Updated : Jul 9, 2021, 10:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.