ప్రపంచ దేశాల్లో కొవిడ్ విస్తరణ కొనసాగుతోంది. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4 కోట్ల 2 లక్షల 80 వేలు దాటింది. ఇప్పటివరకు 11 లక్షల 18 వేల 321 మంది మృతి చెందారు. 3.15కోట్ల మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
అమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా 44 వేల 941మంది కొవిడ్ బారినపడ్డారు. 448 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఫ్రాన్స్‌లో మళ్లీ కరోనా కోరలు చాస్తోంది. కొత్తగా 29 వేల 837 కేసులు వెలుగుచూశాయి. మరో 85 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8 లక్షల 97 వేలు దాటింది.
- కరోనా కేసుల్లో నాలుగో స్థానంలో ఉన్న రష్యాలో కొత్తగా 15 వేల 99మందికి వైరస్ సోకింది. మరో 185మంది మరణించారు.
- బ్రెజిల్లో కొత్తగా 10 వేల 982 కరోనా కేసులు నమోదవగా.. 215మంది మృత్యువాత పడ్డారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 52 లక్షల 35 వేలు దాటింది.
- బ్రిటన్‌లో తాజాగా 16 వేల 982మంది కొవిడ్ బారినపడ్డారు. మరో 67మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఇటలీలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 11,705మంది కరోనా బాధితులుగా మారారు. మరో 69మంది చనిపోయారు.
- మెక్సికోలో తాజాగా 355మంది కొవిడ్ ధాటికి బలయ్యారు. కొత్తగా 5,447 కేసులు నమోదయ్యాయి.
- ఇరాన్లో 252మంది చనిపోయారు. ఒక్కరోజే 3,890మందికి కరోనా సోకింది.
- బెల్జియంలో తాజాగా 10,964 కేసులు బయటపడ్డాయి. మరో 33మంది మరణించారు.
- పోలాండ్‌లో కొత్తగా 8,536మందికి వైరస్ సోకింది. మరో 49మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి: 'టైటానిక్' రేడియో కోసం అన్వేషణ