ETV Bharat / international

కరోనా​ ఎఫెక్ట్​: లఘుశంకకూ సమయమివ్వని దుస్థితి!

కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. చైనాలో రోజురోజుకు ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. రోగులకు సేవలందించేదుకు వైద్య సిబ్బందికి ఊపిరాడడం లేదు. కనీసం లఘుశంక తీర్చుకునేందుకూ వెళ్లలేక డైపర్లతో సరిపెట్టుకుంటున్నారు.

Chinese doctors perform duties wearing diapers
లఘుశంకకూ సమయమివ్వని కొవిడ్‌
author img

By

Published : Feb 13, 2020, 9:58 AM IST

Updated : Mar 1, 2020, 4:30 AM IST

కుప్పలుతెప్పలుగా వచ్చి పడుతున్న రోగులు, అనుమానితులతో చైనాలో వైద్యులు, వైద్య సిబ్బందికి ఊపిరాడడం లేదు. రోజంతా పనిచేస్తున్నా రోగులు తగ్గకపోవడం వల్ల కొందరు వైద్యులు కనీసం లఘుశంక తీర్చుకునేందుకూ వెళ్లలేకపోతున్నారు. డైపర్లు ధరించి విధులు నిర్వర్తిస్తున్నారు. మరికొందరైతే మూత్రం రాకుండా సాధ్యమైనంత తక్కువ నీరు తాగుతున్నారు.

మాస్కులు, ఇతర సురక్షిత పరికరాల కొరతతో పలువురు వైద్యులూ కొవిడ్‌-19 (కరోనా కొత్త వైరస్‌) బారిన పడుతున్నారు. అనారోగ్యం బారినపడ్డ తమద్వారా మరికొందరికి వైరస్‌ సోకుతుందని తెలిసినా అలాగే సేవలందించాల్సి రావడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది.

వైరస్‌ ప్రభావంతో చైనాలో ఇంతవరకు చనిపోయినవారి సంఖ్య 1,355కి చేరింది. జపాన్‌ తీరంలో విహార నౌకను నిలిపేసి, అందులో ఉన్నవారికి వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు ఇద్దరు భారతీయులకు కొవిడ్‌-19 సోకినట్లు తేలింది.

ఇదీ చూడండి: 'కొవిడ్-19' కాటుకు ఒక్కరోజే 242 మంది బలి!

Last Updated : Mar 1, 2020, 4:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.