ETV Bharat / international

ఆ 10వేల మంది హెల్త్​కేర్​ వర్కర్లకు కరోనా!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్​.. ఇరాన్​లోనూ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తాజాగా 10 వేల మంది హెల్త్​కేర్​ వర్కర్లకు వైరస్​ సోకినట్లు వార్తలు బయటకు వచ్చాయి. దీంతో ఆ దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేగింది. ఆ లెక్కలను బహిర్గతం చేయట్లేదని అక్కడి ప్రభుత్వంపై విమర్శలు మొదలయ్యాయి. ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

author img

By

Published : May 21, 2020, 7:49 PM IST

CoronaVirus healthcare workers in iran
10 వేల మంది హెల్త్​కేర్​ వర్కర్లకు కరోనా

ఇరాన్​లో కరోనా వైరస్​ విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో 66 మంది చనిపోగా.. 2,392 మందికి కొత్తగా వైరస్​ సోకింది. అయితే 10వేల మంది హెల్త్​కేర్​ వర్కర్లు కొవిడ్​-19 బారిన పడినట్లు గురువారం కొన్ని మీడియా సంస్థలు వెల్లడించాయి.

లెక్కలు దాస్తోందా..!

గత వారం ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం.. 800 మంది ఆరోగ్య కార్యకర్తలు మాత్రమే కరోనా బారినపడ్డారు. 100మంది చనిపోయారు. కానీ ప్రభుత్వం లెక్కలు దాస్తోందని కథనాలు రావడం ప్రస్తుతం ఆ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై ప్రభుత్వం వివరణ ఇస్తూ ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇరాన్​లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,249కి చేరగా.. 1,29,000మందికి వైరస్​ నిర్ధరణ అయ్యింది. పశ్చిమాసియాలోనే అత్యధిక మరణాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది ఇరాన్​​.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.