ETV Bharat / international

'పుతిన్​ ఆదేశాలతోనే అమెరికా ఎన్నికల్లో జోక్యం' - జోక్యం

2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందనే ఆరోపణలు పెద్ద రాజకీయ దుమారాన్నే రేపాయి. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం ఆ దేశాధ్యక్షుడు పుతిన్​ ఆదేశాల మేరకే జరిగిందన్న వార్త తాజాగా కలకలం సృష్టిస్తోంది. ఈ విషయాన్ని సెంట్రల్​ ఇంటిలిజెన్స్​ ఏజెన్సీకి చెందిన రష్యా గూఢచారి స్పష్టం చేసినట్లు న్యూయార్క్​ టైమ్స్​ కథనం ప్రచురించింది.

'పుతిన్​ ఆదేశాలతోనే అమెరికా ఎన్నికల్లో జోక్యం'
author img

By

Published : Sep 10, 2019, 10:55 AM IST

Updated : Sep 30, 2019, 2:36 AM IST

'పుతిన్​ ఆదేశాలతోనే అమెరికా ఎన్నికల్లో జోక్యం'

2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్​ ట్రంప్​ అనూహ్య విజయం సాధించడంలో రష్యా ప్రమేయం ఉందన్నది చాలా కాలంగా వినిపిస్తున్న మాట. ఈ విషయంపై అగ్రరాజ్యంలో రాజకీయంగా పెను దుమారం రేగింది. తమ అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యాన్ని సహించబోమని ట్రంప్​ పలుమార్లు స్పష్టం చేశారు. అయితే ఈ విషయంపై సెంట్రల్​ ఇంటిలిజెన్స్​ ఏజెన్సీకి చెందిన రష్యా గూఢచారి పలు విషయాలు తెలియజేసినట్లు వస్తున్న కథనాలు సంచలనం రేపుతున్నాయి.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ స్వయంగా ఆదేశాలు జారీ చేశారని ఆ గూఢచారి తెలియజేశాడన్నది కథనం సారాంశం. అత్యంత సున్నితమైనది కావడం వల్ల అప్పటి సీఐఏ డైరక్టర్​ జాన్​ ఒ. బ్రెన్నాన్​ ఈ సమాచారాన్ని బయటకి రాకుండా గోప్యంగా ఉంచారట. ఈ సమాచారాన్ని పూర్తిగా సమీక్షించాల్సిందింగా సీఐఏ అధికారులను ఆదేశించారట. ఇది కచ్చితమైన సమాచారమా కాదా అన్న విషయంపై పూర్తి దర్యాప్తు జరిగినట్లు న్యూయార్క్ టైమ్స్​ కథనంలో పేర్కొంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయంపై అనుమానాలు ఉన్నట్లు 2016లో ఇంటిలిజెన్స్​ అధికారులు తెలియజేశారు. మీడియాలో ఈ విషయంపై పలు కథనాలు రావడం వల్ల.. ఇంటిలిజెన్స్​ అధికారులు ఆ గుఢచారిని రష్యా నుంచి తప్పించారట.

అయితే గుఢచారిని తప్పించిన అనంతరం.. 2018 అమెరికా మధ్యంతర ఎన్నికలు, 2020 అధ్యక్ష ఎన్నికలల్లో రష్యా ప్రమేయంపై ఆధారాలు సేకరించేందుకు సీఐఏ అధికారులు ప్రయత్నిస్తున్నారని ఈ కథనం పేర్కొంది.

సీఎన్​ఎన్​ నివేదిక ప్రకారం.. సున్నిత సమాచారాన్ని ట్రంప్​ ప్రభుత్వం దుర్వినియోగం చేసే అవకాశమున్నందునే ఆ గూఢచారిని తప్పించారు. అయితే దీనికి కచ్చితమైన ఆధారాలు లేవని మాజీ ఇంటిలిజెన్స్​ అధికారులు పేర్కొన్నారు.

Udhampur (J-K), Sep 10 (ANI): Students along with locals and parents staged protest in Jammu and Kashmir's Udhampur. These students are from Thani Dhar High School in Ladha area. They blocked Jammu-Srinagar national highway. They held protest against shortage of teachers in the school.

Last Updated : Sep 30, 2019, 2:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.