ETV Bharat / international

'చలిని తట్టుకొనేలా సైన్యానికి అధునాతన పరికరాలు'

వాస్తవాధీన రేఖ వద్ద భారీగా సైన్యాన్ని మోహరించిన చైనా.. వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించినట్లు చెప్పుకొచ్చింది. చలికాలంలోనూ సమర్థంగా విధులు నిర్వర్తించేలా అధునాతన పరికరాలు అందించినట్లు తెలిపింది. బయట మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ.. లోపల వెచ్చగా ఉండే క్యాబిన్​లను రూపొందించినట్లు వెల్లడించింది.

chinese
'చలిని తట్టుకొనేలా సైన్యానికి అధునాతన పరికరాలు'
author img

By

Published : Oct 30, 2020, 5:43 AM IST

తూర్పు లద్దాఖ్​లో మోహరించిన తమ సైనికులు చలిని తట్టుకునేందుకు అత్యాధునిక పరికరాలను అందించినట్లు చైనా రక్షణ శాఖ వెల్లడించింది. సైనికులు స్వయంగా నిర్మించుకోగలిగే డిస్​మౌంటెబుల్ సెల్ఫ్ ఎనర్జైస్డ్ ఇన్సులేటెడ్ క్యాబిన్​లను సమకూర్చినట్లు తెలిపింది. 5 వేల మీటర్ల ఎత్తులో.. బయట మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ.. ఈ క్యాబిన్లలో ఉష్ణోగ్రత 15 డిగ్రీలు ఉండేలా రూపొందించినట్లు చెప్పింది.

ఓ ఆన్​లైన్ సమావేశంలో మాట్లాడిన చైనా రక్షణ శాఖ ప్రతినిధి వూ కువాన్.. లద్దాఖ్​లో తమ సైనికులకు అందిస్తున్న సదుపాయాల గురించి వివరించారు. వ్యక్తిగత స్లీపింగ్ బ్యాగులు, శిక్షణ కోట్లు, చలిని తట్టుకొనే బూట్లను సైనికుల కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపారు. ఇవన్నీ పర్వత ప్రాంతాల్లో అధిక చలిని నిలువరించేందుకు ఉపయోగపడతాయని చెప్పారు. తాజా పండ్లు, కూరగాయలు సరఫరా చేసేందుకు మానవ రహిత విమానా(యూఏవీ)లను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. ఇది సైనికుల యుద్ధ సన్నద్ధతను పెంచుతుందని అన్నారు.

వీడని ప్రతిష్టంభన

ఐదు నెలలుగా భారత్​-చైనా సరిహద్దులో ప్రతిష్టంభన కొనసాగుతోంది. వాస్తవాధీన రేఖ వెంబడి భారీగా సైన్యాన్ని మోహరించింది చైనా. చలికాలంలోనూ పహారా కాసేలా చర్యలు తీసుకుంటోంది. అటు భారత్ సైతం దీటుగా సిద్ధమైంది. సైనికులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.