70వ జాతీయ దినోత్సవం జరుపుకునేందుకు చైనా భారీగా ముస్తోబవుతోంది. తమ స్వాతంత్య్ర దినోత్సవాన.. భారీ పరేడ్ నిర్వహించనుంది చైనా సైన్యం. అక్టోబర్ 1న జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా క్షిపణులు, యుద్ధ ట్యాంకులతో శనివారం పెద్ద ఎత్తున రిహార్సల్స్ నిర్వహించింది. చిన్న, పెద్ద క్షిపణుల్ని మోసుకొస్తున్న భారీ ట్రక్కులు, యుద్ధట్యాంకులతో చారిత్రక చాంగ్'ఆన్ ప్రాంతం దద్దరిల్లింది.
రిహార్సల్స్‌లో వీటితో పాటు అణ్వాయుధాలు, అధునాతన సాంకేతిక పరికరాలు ప్రదర్శిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. చైనా ఆర్మీ, నేవీ, వైమానిక దళం, వ్యూహాత్మక సహాయక దళాలు తమ ఆయుధాల ప్రదర్శన చేస్తున్నట్లు తెలిపారు. 2017తో పోలిస్తే ఈ ఏడాది పరేడ్‌ను చాలా గొప్పగా నిర్వహించనున్నట్లు వివరించారు.
సుమారు 2 మిలియన్ల సైన్యంతో ప్రపంచంలోనే అతి పెద్ద బలగం కలిగిన దేశంగా పేరు పొందిన చైనా.. తిరుగులేని శక్తిగా అవతరించాలని భావిస్తోంది. కవాతుతో తమ సైనిక బలాన్ని ప్రపంచానికి.. ముఖ్యంగా అమెరికాకు ప్రదర్శించేందుకు సిద్ధమైంది.
ఇదీ చూడండి:'లైట్ షో': డ్రోన్లతో ప్రదర్శన.. వీక్షకులకు కనువిందు