ETV Bharat / international

హ్యూమన్​ ట్రయల్స్​లో 'చైనా వ్యాక్సిన్​' మెరుగైన ఫలితాలు - కరోనా వైరస్​ వ్యాక్సిన్​

ప్రపంచమంతా కరోనా వైరస్​తో ఇబ్బందిపడుతున్న సమయంలో చైనా తయారు చేసిన ఓ వ్యాక్సిన్​​ క్యాండిడేట్​ కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఈ టీకా హ్యూమన్​ ట్రయల్స్​లో మెరుగైన ఫలితాలు సాధించింది. బీబీఐబీపీ-కార్​వీ పేరిట తయారైన ఈ వ్యాక్సిన్​.. వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడంలో విజయవంతమైనట్లు పరిశోధకులు తెలిపారు. తాజాగా వాటి ఫలితాల వివరాలు 'ద లాన్సెట్​ ఇన్​ఫెక్షియస్ డిసీ​సెస్​' జర్నల్​లో ప్రచురితమయ్యాయి.

Chinese COVID-19 vaccine
వృద్ధులపైనా ప్రభావం చూపించిన 'చైనా వ్యాక్సిన్​'
author img

By

Published : Oct 16, 2020, 5:21 PM IST

కరోనా వైరస్​పై పోరాటంలో భాగంగా చైనా తయారు చేసిన ఓ వ్యాక్సిన్​ సత్ఫలితాలిస్తోంది. 'బీబీఐబీపీ-కార్​వీ' పేరిట తయారైన ఈ టీకా.. తొలి రెండు దశల హ్యూమన్​ ట్రయల్స్​లో సురక్షితమని తేలింది. ఈ వ్యాక్సిన్​ పరిశోధనలకు సంబంధించిన వివరాలతో 'ద లాన్సెట్'​ జర్నల్​ శుక్రవారం ఓ వ్యాసం ప్రచురించింది.

80 ఏళ్ల వారిలోనూ..

హ్యూమన్​ ట్రయల్స్​లో 18 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయసున్నవారు పాల్గొన్నారు. వారందరిలో యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు పరిశోధకులు పేర్కొన్నారు.

"ఈ వ్యాక్సిన్​ ద్వారా వృద్ధులను రక్షించాలన్నదే మా ధ్యేయం. ఎందుకంటే ఈ వయస్సు వారే ఎక్కువగా మహమ్మారి బారిన పడుతున్నారు. వీరిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల మిగతా వ్యాక్సిన్లు కాస్త తక్కువ ప్రభావం చూపుతున్నాయి. అయితే మేము తయారు చేసిన వ్యాక్సిన్​ 60 ఏళ్లు పైబడిన వారిలోనూ యాంటీబాడీలు ఉత్పత్తి చేస్తోంది. దీనిపై మరింత లోతైన పరిశోధన అవసరం".

--జియామింగ్​ యాంగ్, పరిశోధక బృందంలోని ప్రొఫెసర్​

అధ్యయనంలో ఉపయోగించిన 'బీబీఐపీబీ-కార్​వీ' వ్యాక్సిన్ చైనాలోని ఓ రోగి నుండి వేరుచేసిన వైరస్ నమూనా ఆధారంగా రూపొందించారు. సెల్ లైన్లను ఉపయోగించి ప్రయోగశాలలో వైరస్​ను పెంచారు. తర్వాత 'బీటా-ప్రొప్రియానోలాక్టోన్' అనే రసాయనాన్ని ఉపయోగించి దాన్ని క్రియారహితం చేశారు. క్రియారహిత వైరస్​తో పాటు అల్యూమినియం, హైడ్రాక్సైడ్​ను కలిపి ఈ వ్యాక్సిను రూపొందించారు(అల్యూమినియం హైడ్రాక్సైడ్ అనేది సహాయకారిగా పనిచేసి రోగనిరోధక ప్రతిస్పందనలను పెంచుతుంది).

దశల వారీగా..

మొదటి దశలో 18-59 ఏళ్లవారిని 96 మందిని, 60-80 సంవత్సరాల వారిని 96 మందిని తీసుకొని వారిపై వ్యాక్సిన్​ను ప్రయోగించారు. తొలి విడతలో గ్రూపులుగా విడగొట్టి.. ప్రతి గ్రూప్​నకు మూడు భిన్నడోస్​లు ఇచ్చి పరీక్షించారు.

రెండో దశలో 18-59 సంవత్సరాల వారిని మాత్రమే పరీక్షించారు. ఇందులో మొత్తం 448 మంది పాల్గొన్నారు. ఈ దశలో ప్రతి గ్రూప్​నకు 8 మైక్రోగ్రాముల సింగిల్​ డోస్​ లేదా 4 మైక్రోగ్రాములతో రెండు డోసులు ఇచ్చి పరీక్షించారు.

ఈ ట్రయల్స్​లో 28 రోజుల్లో ఎవరిలోనూ ఎటువంటి ప్రతికూల స్పందనలు కనిపించలేదు. అయితే సూది మందు వేసిన ప్రాంతంలో కాస్త నొప్పిగా ఉన్నట్లు గుర్తించారు. ఎవరిలోనూ అవయవాలు దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపించలేదని పరిశోధకులు పేర్కొన్నారు. 18-59 ఏళ్ల వయసు వారిలో 28 రోజుల్లోనే యాంటీబాడీలు ఉత్పత్తి కాగా.. 60 ఏళ్లు పైబడిన వారికి మాత్రం ఇందుకు 42 రోజులు పట్టింది.

మూడో దశలో మరిన్ని విషయాలు తెలుస్తాయని పరిశోధనా బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 42 వ్యాక్సిన్లు ప్రస్తుతం క్లినికల్​ ట్రయల్స్​లో ఉన్నాయి.

ఇదీ చూడండి: ఈ వందేళ్లలో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు ఇవే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.