జాబిల్లి ఉపరితలంపై సేకరించిన రాళ్ల నమూనాలను.. ఆర్బిటర్‌కు చాంగే-5 చేర్చినట్టు ఆదివారం చైనా ప్రకటించింది. ఆదివారం ఉదయం ఈ 'డాకింగ్' ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్టు పేర్కొంది సీఎన్ఎస్ఏ(చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్).
నవంబర్ 24న ఈ చాంగే-5ను ప్రయోగించింది చైనా. ఇందులో ఆర్బిటర్, అసెండర్, ల్యాండర్, రిటర్నర్ అని నాలుగు భాగాలున్నాయి. ఆర్బిటర్- రిటర్నర్ భాగం చంద్రుడి కక్ష్యలోనే ఉండిపోగా.. ఈ నెల 1న ల్యాండర్-అసెండర్ జాబిల్లిపై కాలిమోపింది. చంద్రుడిపై దిగి, మట్టి, శిలలను సేకరించి తిరిగి అసెండర్ భాగం శుక్రవారం నింగిలోకి దూసుకెళ్లింది. అనంతరం అర్బిటర్ ఉన్న కక్ష్యలోకి చేరుకుంది. తాజాగా.. చైనా కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 6:12కు అర్బిటర్తో అనుసంధానమైంది అసెండర్. రైళ్ల నమూనాలను చేర్చింది.
ఇదీ చూడండి:- జాబిల్లిపై జాతీయ జెండా పాతిన చైనా
అసెండర్ నుంచి విడిపోయి భూమికి తిరిగివచ్చేందుకు ఆర్బిటర్-రిటర్నర్ భాగం సరైన సమయం కోసం ఎదురుచూస్తోంది.
చైనా చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన ప్రాజెక్టుల్లో చాంగే-5 ఒకటి. ఈ నెలలో మంగోలియాలో ఇది ల్యాండ్ అయ్యే అవకాశముంది.
ఇదీ చూడండి:- ప్రపంచంలోనే వేగవంతమైన కంప్యూటర్- 'జియూఝాంగ్'