ETV Bharat / international

వైరస్​ పుట్టినిల్లు వుహాన్​లో లాక్​డౌన్​ ఎత్తివేత - చైనాలో లాక్​డౌన్​ ఎత్తివేత

కరోనా వైరస్​ పుట్టినిల్లైనా చైనాలోని వుహాన్​లో 76రోజుల తర్వాత లాక్​డౌన్​ ఎత్తివేసింది అక్కడి ప్రభుత్వం. ఈ సందర్భంగా నగరంలోని భవనాలను రంగురంగుల దీపకాంతులతో ముస్తాబు చేశారు. నివాసితులు ఈ దీపకాంతుల ప్రదర్శనను తిలకించేందుకు భారీగా తరలి వచ్చారు.

China's virus pandemic epicenter Wuhan ends 76-day lockdown
వైరస్​ పుట్టినిల్లు వుహాన్​లో లాక్​డౌన్​ ఎత్తివేత
author img

By

Published : Apr 8, 2020, 6:33 AM IST

Updated : Apr 8, 2020, 7:22 AM IST

వుహాన్​.. కొన్ని నెలలుగా ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న చైనాలోని ఓ నగరం. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్​ పుట్టినిల్లు. ఇన్ని రోజులు ఇక్కడి ప్రజలు అనేక ఆంక్షల మధ్య నలిగిపోయారు. ఓ వైపు వైరస్​ విజృంభణ.. మరోవైపు లాక్​డౌన్​తో ఉక్కిరిబిక్కిరైపోయారు. ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. 76రోజుల లాక్​డౌన్​ నుంచి వుహాన్​వాసులకు ఎట్టకేలకు విముక్తి లభించింది.

దీపకాంతులతో కొత్త కళ...

లాక్​డౌన్​ ఎత్తివేత సందర్భంగా నగరమంతా కొత్త కళను సంతరించుకుంది. లక్షలాది విద్యుత్ దీపాల అలంకరణల మధ్య దగదగా మెరిసిపోయింది. నగరంలోని ప్రముఖ యంగేట్జ్​ నది వంతెన, ఎత్తైనా భవనాలు విద్యుత్​ దీపాలతో ముస్తాబైపోయాయి. కరోనా బాధితులకు తమ ప్రాణాలను పణంగా పెట్టి చికిత్స అందించిన వైద్యుల చిత్రాలను భవనాలపై ప్రదర్శించి కృతజ్ఞతలు తెలిపింది ప్రభుత్వం.

సంబరాల్లో ప్రజలు

76 రోజల పాటు లాక్​డౌన్​తో ఇళ్లకే పరిమితమైన ప్రజలు రోడ్లపైకి భారీగా తరలి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. నగరంలో ఏర్పాటు చేసిన దీపకాంతుల ప్రదర్శనను ఎంతో ఉత్సాహంగా తిలకించారు.

షరతులు వర్తిస్తాయి

లాక్​డౌన్​ను ఎత్తివేసినా.. కొన్ని షరతులు విధించింది ప్రభుత్వం. పౌరులు తప్పని సరిగా.. వారి ఆరోగ్య పరిస్థితిని సూచించే ఓ యాప్​ను తమ స్మార్ట్​ఫోన్లలో ఇన్​స్టాల్​ చేసుకోవాలని నిబంధన విధించింది. యాప్​లో ఉన్న డేటా ఆధారంగా వారు ఇటీవలే వైరస్​ సోకిన వ్యక్తిని కలిశారా? లేదా? అన్న విషయం తెలుస్తుంది. వారు ఆరోగ్యంగా ఉంటేనే ఇతర ప్రదేశాలకు ప్రయాణించేందుకు అంగీకరిస్తారు.

ఇప్పటివరకు చైనాలో 82వేల మంది వైరస్​ బారిన పడ్డారు. 3వేల 300మందికి పైగా మరణించారు.

వైరస్​ పుట్టినిల్లు వుహాన్​లో లాక్​డౌన్​ ఎత్తివేత

ఇదీ చూడండి:స్పెయిన్​లో గేర్​ మార్చిన కరోనా- మళ్లీ విజృంభణ

Last Updated : Apr 8, 2020, 7:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.