చైనాలో కరోనా వైరస్ మరణాల సంఖ్య తాజాగా 259కి చేరింది. నిన్న ఉదయం వరకు 213 మంది ఈ మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో 46 మంది బలయ్యారని చైనా అధికారిక వర్గాలు తెలిపాయి.
ఈ వైరస్ బాధితుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా 11,791 మందికి ఈ వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: నక్క-కుక్క పోరాడితే ఎట్లా ఉంటుందో తెలుసా!