మన దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయం పాటిస్తుంటారు. కొన్ని చోట్ల సంక్రాంతి పండగ అంటే వెంటనే గుర్తుకొచ్చేది కోళ్ల పందేలు. కర్ణాటకలోనూ ఇదే కోవలో ఓ క్రీడ అక్కడి వారికి సంప్రదాయంగా వస్తోంది. కర్ణాటక మైసూరు జిల్లాకు చెందిన హెబ్బలగప్పె గ్రామంలో ఏటా నిర్వహించే వేణుగోపాల స్పామి ఉత్సవంలో నక్క-కుక్కల మధ్య పోటీ పెడతారు గ్రామస్థులు.
అడవిలో నక్కలను తీసుకొచ్చి.. వాటికి, కుక్కలకు బల పరీక్ష పెడతారు. వాటి పోట్లాట చూసేందుకు ఊరంతా తరలివస్తారు. ఈ విధమైన ఆచారాన్ని పాటించడం వల్ల గ్రామస్థులందరికీ మంచి జరుగుతుందని వారి విశ్వాసం. పూర్వీకుల కాలం నుంచే ఈ ఆచారాన్ని పాటిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.