ETV Bharat / international

చైనా వెన్నుపోటు- నేపాల్​ భూభాగం దురాక్రమణ - చైనా వెన్నుపోటు- నేపాల్​ భూభాగంపై అతిక్రమణలు

నేపాల్​పై చైనా తన దురాక్రమణ బుద్ధిని ప్రదర్శించింది. నేపాల్ భూభాగంలోని ఓ గ్రామాన్ని పూర్తిగా ఆక్రమించింది. దీంతో పాటు మరో 10 ప్రదేశాల్లో 33 హెక్టార్ల భూమిని తన హస్తగతం చేసుకుంది. నదుల ప్రవాహాన్ని మార్చుతూ ఈ భూభాగాలను కొల్లగొట్టింది. నేపాల్​పై నియంత్రణ సాధించేందుకు మరిన్ని ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

China using road construction to encroach Nepali land: Government report
చైనా వెన్నుపోటు- నేపాల్​ భూభాగంపై అతిక్రమణలు
author img

By

Published : Jun 23, 2020, 9:26 PM IST

Updated : Jun 23, 2020, 9:39 PM IST

చైనా తన దురాక్రమణ బుద్ధిని మరోసారి చాటుకుంది. తమ దేశానికి అన్నివైపులా సరిహద్దులను చెరిపివేస్తూ వచ్చిన చైనా.. ఇప్పుడు నేపాల్​పైనా కన్నేసింది. తనకు వంతపాడుతున్నప్పటీకీ చైనా వెన్నుపోటు పొడిచింది. మిత్రదేశంగా నటిస్తూనే దొంగదెబ్బ తీసిన చైనా... పక్కా ప్రణాళికతో భూభాగాన్ని హస్తగతం చేసుకుంది. నేపాల్​పై పూర్తిగా పట్టు సాధించేందుకు పావులు కదుపుతోంది.

దురాక్రమణ

ఈ మేరకు నేపాల్ సరిహద్దులోని 10 ప్రదేశాల్లో 33 హెక్టార్ల భూమిని ఆక్రమించుకుంది. నదుల ప్రవాహ దిశ మార్చేసి నేపాల్​తో ఉన్న సహజ సరిహద్దులను చెరిపేసింది. ఈ విషయాలన్నీ నేపాల్ వ్యవసాయ మంత్రత్వ శాఖ రూపొందించిన నివేదికలోనే బయటపడ్డాయి.

టిబెట్​లో పెరుగుతున్న రోడ్డు నిర్మాణాలను ఉపయోగించుకొని.. ఈ ఆక్రమణలు చేసినట్లు నివేదికలో నేపాల్ మంత్రిత్వ శాఖ నివేదిక పేర్కొంది. భవిష్యత్తులో సరిహద్దు వద్ద బోర్డర్ అవుట్​పోస్టులను ఏర్పాటు చేసే అవకాశం ఉందని హెచ్చరించింది.

"టిబెట్ అటానమస్ ప్రాంతంగా పిలిచే ప్రాంతంలో చైనా ప్రభుత్వం రహదారి నెట్​వర్క్​ను విస్తృతంగా పెంచుకుంటోంది. ఈ కారణంగా కొన్ని నదులు, వాటి ఉపనదులు వాటి మార్గాన్ని మార్చుకొని నేపాల్ వైపు ప్రవహిస్తున్నాయి. మారుతున్న నదుల ప్రవాహం క్రమంగా నేపాల్ భూభాగాన్ని తగ్గిస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే నేపాల్​లోని చాలా వరకు భూభాగం టిబెట్​ ​వైపు వెళ్లే అవకాశం ఉంది."

-నేపాల్ ప్రభుత్వ నివేదిక

చైనా చేపట్టిన నిర్మాణ పనులు.. బాగ్దారే ఖోలా, కర్నాలి నదుల ప్రవాహాన్ని మార్చడం వల్ల హుమ్లా జిల్లాలో 10 హెక్టార్ల భూమి ఆక్రమణకు గురైనట్లు నివేదిక తెలిపింది. టిబెట్​లో జరిగిన నిర్మాణ పనుల వల్ల సిన్జెన్, భుర్జుక్, జంబు ఖోలా నదుల ప్రవాహం మార్చి ఆరు హెక్టార్ల భూమి ఆక్రమించినట్లు పేర్కొంది.

అదేవిధంగా సింధుపాల్​చౌక్ జిల్లాలోని ఖారనె ఖోలా, భోతే కోసి నదుల మళ్లింపు వల్ల మొత్తం 11 హెక్టార్ల భూమి.. చైనా నియంత్రణలో ఉన్న టిబెట్​లో అంతర్భాగమైంది. టిబెట్​లో చైనా రోడ్డు నిర్మాణ పనుల వల్ల సుమ్జుంగ్​, కమ్​ ఖోలా, అరుణ్ నదులు సైతం తమ గతిని మార్చుకున్నాయి. ఫలితంగా 9 హెక్టార్ల భూమి ఆక్రమణకు గురైంది. సకాలంలో చర్యలు తీసుకోకపోతే తన భూభాగాన్ని చాలా వరకు కోల్పోయే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది.

"ఇది ఇలాగే కొనసాగితే వందలాది హెక్టార్ల భూమి సహజంగా టిబెట్​ అటానమస్ ప్రాంతంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఆ తర్వాత చైనా ఈ ప్రాంతాల్లో బోర్డర్ అబ్జర్వేషన్ పోస్టులను నెలకొల్పే అవకాశం ఉంది."

-నేపాల్ ప్రభుత్వ నివేదిక

1960 సర్వే తర్వాత తమ భూభాగాలను గుర్తించడానికి చైనాతో సరిహద్దులో స్తంభాల నిర్మాణం ప్రారంభించింది నేపాల్​. ఉత్తర సరిహద్దులో 100 స్తంభాలను మాత్రమే నిర్మించింది. ఆ తర్వాత వీటి రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరోవైపు భారత్​తో ఉన్న సరిహద్దులో మాత్రం 8,553 స్తంభాలను నిర్మించింది.

ఏకంగా ఓ గ్రామాన్నే..!

మరోవైపు నేపాల్​ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని భారత ప్రభుత్వ ఉన్నత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం.. గోర్ఖా జిల్లాలోని రుయి గ్రామం పూర్తిగా చైనా నియంత్రణలో ఉందని స్పష్టం చేశాయి. ఈ ఆక్రమణను చట్టబద్ధం చేసుకోవడానికి సరిహద్దు స్తంభాలను తొలగించిందని పేర్కొన్నాయి. నేపాల్​పై పూర్తి ఆధిపత్యం సాధించేందుకు చాలా ప్రాంతాల్లో చొరబడినట్లు తెలిపాయి.

"ఇతరుల భూభాగాల్లో జోక్యం చేసుకోమనే దౌత్య విధానానికి తూట్లు పొడుస్తూ.. రుయి గ్రామాన్ని చైనా పూర్తిగా ఆక్రమించింది. గ్రామంలోని 72 కుటుంబాలు తమ వాస్తవ గుర్తింపు కోసం పోరాడుతున్నాయి. ప్రస్తుత నేపాల్ నాయకత్వం చైనా పాలనకు ఏ విధంగా లొంగిపోయిందనే విషయాన్ని ఇది స్పష్టం చేస్తోంది."

-ప్రభుత్వ వర్గాలు

పక్కా ప్రణాళికతో రెండేళ్ల పాటు ఓ క్రమ పద్ధతిని పాటిస్తూ రుయి గ్రామాన్ని చైనా ఆక్రమించిందని అధికారులు వెల్లడించారు. దీంతో పాటు నాలుగు జిల్లాల్లోని 11 ప్రదేశాల్లో 36 హెక్టార్ల వ్యూహాత్మకమైన ప్రాంతాన్ని చైనా ఆక్రమించిన విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు.

రుయి గ్రామం ముందు నుంచీ నేపాల్​ మ్యాప్​లోనే ఉండటం వల్ల అక్కడి ప్రజలందరూ ఆ దేశ గుర్తింపుతోనే ఉన్నారని పేర్కొన్నారు. కానీ నేపాల్ మాత్రం చైనా ఆదేశాలతో భారత్​కు చెందిన భూభాగాలపై వివాదం సృష్టించడానికే ఎక్కువగా మొగ్గుచూపుతోందని అన్నారు.

"చైనా దూకుడైన జాతీయవాదం, సైనిక విస్తరణ గురించి తెలుసుకున్న తరువాత కూడా... కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) నాయకులు రూపొందించిన విధానాలపై నేపాల్ ప్రభుత్వం నిశ్శబ్దంగా ఉండటానికే ఇష్టపడుతోంది."

-ప్రభుత్వ వర్గాలు

ఓ వైపు చైనా తన భూభాగాన్ని మింగేస్తున్నా... నేపాల్ మాత్రం భారత్​పై గిల్లిగజ్జాలకు పాల్పడుతోంది. ఎన్నో ఏళ్లుగా భారత్​తో ఉన్న సత్సంబంధాలు విస్మరించి వివాదాలకు తెరతీస్తోంది. కాలాపానీ, లింపియాధురా, లిపులేఖ్​లపై రగడ సృష్టిస్తోంది. భారత్​ అధీనంలో ఉన్న వీటిని తమ భూభాగంలోవిగా చూపుతూ మ్యాప్​ను విడుదల చేసింది. అంతటితో ఆగకుండా మరిన్ని వివాదాలకు ఆజ్యం పోస్తోంది. భూభాగంలోకి చొరబడ్డారని ఆరోపిస్తూ ఓ భారత పౌరుడిని కాల్చిచంపింది. బిహార్​ సరిహద్దులో​ చేపట్టిన వరద నియంత్రణ కార్యక్రమాలకు అడ్డుపడుతోంది.

ఇదీ చదవండి: కరోనా కేసుల్లో తమిళనాడును దాటేసిన దిల్లీ

Last Updated : Jun 23, 2020, 9:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.