ETV Bharat / international

అంతరిక్ష కేంద్రానికి సరకులతో చైనా వ్యోమనౌక పయనం - తియాన్​ఝౌ-2

రోదసిలో నిర్మిస్తున్న తన అంతరిక్ష కేంద్రానికి ఆహారం, ఉపకరణాలు, ఇంధనాన్ని మోసుకెళుతూ చైనా వ్యోమనౌక శనివారం విజయవంతంగా నింగిలోకి పయనమైంది. భూ కక్ష్యలో చైనా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రానికి సంబంధించిన ముఖ్య భాగం ఇప్పటికే రోదసిలోకి చేరింది. తాజాగా ప్రయోగించిన తియాన్​ఝౌ-2.. ఆ భాగంతో అనుసంధానమవుతుంది.

spacecraft
చైనా వ్యోమనౌక
author img

By

Published : May 30, 2021, 6:46 AM IST

రోదసిలో నిర్మిస్తున్న తన అంతరిక్ష కేంద్రానికి ఆహారం, ఉపకరణాలు, ఇంధనాన్ని మోసుకెళుతూ చైనా వ్యోమనౌక శనివారం విజయవంతంగా నింగిలోకి పయనమైంది. తియాన్​ఝౌ-2 అనే ఈ సరకు రవాణా వ్యోమనౌకను లాంగ్​ మార్చ్​-7 వై3 రాకెట్​ ద్వారా ప్రయోగించారు. హైనాన్​ ప్రావిన్స్​లోని వెన్​చాంగ్​ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది.

నిజానికి గతవారమే ఈ యాత్ర జరగాల్సి ఉన్నప్పటికీ సాంకేతిక సమస్య వల్ల వాయిదాపడింది. తియాన్హే పేరుతో భూ కక్ష్యలో ఒక అంతరిక్ష కేంద్రాన్ని చైనా నిర్మిస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించిన ముఖ్య భాగం రోదసిలోకి చేరింది. తాజాగా ప్రయోగించిన తియాన్​ఝౌ-2.. ఆ భాగంతో అనుసంధానమవుతుంది. దాదాపు 160 ప్యాకేజీలను అంతరిక్ష కేంద్రంలోకి బట్వాడా చేస్తుంది. భవిష్యత్​లో అక్కడికి రాబోయే వ్యోమగాముల కోసం ఆహారం, సరకులు సైన్స్​ పరికరాలు,అంతరిక్ష కేంద్రం కోసం రెండు టన్నుల ఇంధనం వంటివి ఇందులో ఉన్నాయి. షెంఝౌ-12 అనే వ్యోమనౌక ద్వారా త్వరలో ముగ్గురు వ్యోమగాములు ఇక్కడికి పయనమవుతారు. వారు మూడు నెలల పాటు అందులోనే ఉంటారు.

తియాన్హే అంతరిక్ష కేంద్ర ముఖ్య భాగాన్ని భారీ రాకెట్​ 'లాంగ్​ మార్చ్​-5బి వై2' ద్వారా గత నెలలో చైనా ప్రయోగించింది. అయితే ఆ భాగాన్ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టాక ఆ రాకెట్​.. భూమి దిశగా తిరిగి రావడం ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించింది. రాకెట్​ శకలాలు జనావాసాలపై పడొచ్చన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. చివరికి అవి సముద్రంలో పడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చదవండి: చైనా నౌకల నుంచి ఆహారం దిగుమతికి అమెరికా నో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.