ETV Bharat / international

'ద్వైపాక్షిక సంబంధాలను సరిహద్దుతో ముడిపెట్టొద్దు' - చైనా భారత్​ సరిహద్దు సమస్య

భారత్​, చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు సమస్యను ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో ముడిపెట్టి చూడకూడదని చైనా వ్యాఖ్యానించింది. శాంతిపూర్వక చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలని పేర్కొంది.

border issue between china and india
చైనా, భారత్​ సంబంధాలు
author img

By

Published : Jun 23, 2021, 7:59 PM IST

భారత్​, చైనా మధ్య నెలకొన్న సరిహద్దు సమస్యలను శాంతి పూర్వక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని చైనా పేర్కొంది. అదే సమయంలో సరిహద్దు సమస్యలను ద్వైపాక్షిక సంబంధాలతో ముడిపెట్టకూడదని ఆ దేశ విదేశాంగ మంత్రి ఝావో అన్నారు.

"శాంతిపూర్వక చర్చల ద్వారా సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవాలి. సరిహద్దు సమస్యను ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో ముడిపెట్టొద్దు."

-ఝావో లిజియాన్, చైనా విదేశాంగ మంత్రి

సరిహద్దుకు పశ్చిమాన తాము బలగాలను సాధారణ రక్షణ చర్యల్లో భాగంగానే మోహరించామని లిజియాన్​ తెలిపారు. ఇది చైనా భూభాగాన్ని ఆక్రమించేందుకు యత్నించే దేశాలను అడ్డుకోవడానికి మాత్రమేనని స్పష్టం చేశారు.

వివాదాస్పద సరిహద్దులో బలగాల ఉపసంహరణపై చైనా కట్టుబడి ఉంటుందా అనే అనిశ్చితి ఇరు దేశాల మధ్య సంబంధాలకు సవాలుగా మారిందని ఖతార్​లో జరిగిన ఓ సదస్సులో భారత్​ విదేశాంగ మంత్రి జైశంకర్​ వ్యాఖ్యానించారు. ఇందుకు స్పందనగా.. ఝావో లిజియాన్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

చైనా-భారత్ సరిహద్దు ప్రాంతమైన తూర్పు లద్ధాఖ్​లోని గల్వాన్‌ లోయలో ఇరు దేశాల సైనికుల పరస్పర ఘర్షణలకు ఏడాది పూర్తయింది. 2020 జూన్‌ 15న జరిగిన ఈ ఘర్షణలల్లో ఇరువైపులా ప్రాణనష్టం జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బలగాల ఉపసంహరణకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరినప్పటికీ అది పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు.

ఇదీ చూడండి: Galwan Clash: భారత్​ నేర్వాల్సిన పాఠాలు!

ఇదీ చూడండి: Galwan: 'ఆ ఘటనతో చైనాకు తెలిసొచ్చింది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.