చైనాలో తాజాగా మరో 30 వైరస్ కేసులు నమోదయినట్లు వెల్లడించింది అక్కడి ఆరోగ్య శాఖ. ఇందులో ఐదు కేసులు స్థానికంగా వ్యాప్తి చెందినట్లు పేర్కొన్నారు అధికారులు. మిగతావారు విదేశాల నుంచి వచ్చినట్లు చెప్పారు. వైరస్ కేంద్రస్థానమైన హుబేలో కరోనా కారణంగా శనివారం ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఈ మరణాలతో కలిపి చైనాలో మృతుల సంఖ్య 3329కి చేరింది. ఇప్పటివరకు 81, 669 కరోనా కేసులు నమోదయ్యాయి. 1376 మంది వైరస్‌కు చికిత్స పొందుతున్నారు. 76, 964మందికి వైరస్ నయమైంది.
దొంగ వైరస్ కేసుల్లో పెరుగుదల..
కరోనా లక్షణాలు లేకుండా దాడిచేసే దొంగ వైరస్ మరో 47 మందికి సోకినట్లు సమాచారం. ఇప్పటికే ఇలా వైరస్ లక్షణాలు లేని 1024 మందిని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
వుహాన్‌కు తగ్గిన ముప్పు..
వైరస్ కేంద్రస్థానమైన వుహాన్‌లో కరోనా ముప్పు తగ్గినట్లు ప్రకటించింది చైనా. వైరస్ సోకే ప్రమాదం అత్యధిక స్థాయి నుంచి మధ్య తరహాకు మారినట్లు పేర్కొంది. వుహాన్‌లోని 13 జిల్లాల్లో తొమ్మిదింటికి వైరస్ ముప్పు స్వల్ప స్థాయికి తగ్గిందని, నాలుగింటిలో మధ్యతరహాకు మారినట్లు చెప్పింది.
ప్రపంచవ్యాప్తంగా ఇలా..
ప్రపంచవ్యాప్తంగా నేడు 1800కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 12 లక్షలకు పైగా కేసులు పెరిగాయి. 64,700కు పైగా ప్రాణాలు కోల్పోయారు. అంతర్జాతీయంగా కరోనా గణాంకాలు ఇలా ఉన్నాయి.
ఇదీ చూడండి: పాక్‌కు 'అండర్వేర్ మాస్కులు' పంపిన చైనా