తమ దేశంలో అశ్లీలత, ఇతర తప్పుడు సమాచారాన్ని నియంత్రించేందుకు చైనా కీలక నిర్ణయం తీసుకుంది. తన భాగస్వామి ట్రిప్అడ్వైజర్ సహా 105 మొబైల్ యాప్‌లను యాప్‌స్టోర్ నుంచి తొలగించాలని జాతీయ సైబర్‌స్పేస్ ఉత్తర్వులు జారీ చేసింది. అశ్లీలత, పోర్నోగ్రఫీ, హింసాత్మక సమాచారం, మోసాలు, వ్యభిచారం వంటివాటిపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
అయితే ట్రిప్అడ్వైజర్ చైనా, ట్రిప్ అడ్వైజర్‌కు జాయింట్ వెంచర్ అయిన ట్రిప్.కామ్ ఇంకా ఈ నిషేధంపై స్పందించలేదు.
ఇదీ చూడండి: 'చైనా టీకా 86% సమర్థవంతం'