ETV Bharat / international

వారానికి 3 గంటలే ఆన్​లైన్ గేమ్స్.. సర్కారు ఆంక్షలు!

author img

By

Published : Aug 30, 2021, 9:24 PM IST

ఆన్​లైన్ గేమ్స్ ఆడుకునే పిల్లలకు షాకింగ్ న్యూస్! ఇక నుంచి వారానికి మూడు గంటలు మాత్రమే ఆడుకునే వీలుంది. అది కూడా శుక్ర, శని, ఆదివారాల్లోనే. మిగితా రోజుల్లో ఆన్​లైన్ గేమ్స్​పై చైనాలో పరిమితులు ఉండనున్నాయి!

CHINA online games restrictions
ఆన్​లైన్ గేమ్స్ ఆంక్షలు

చిన్నారులపై కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది చైనా ప్రభుత్వం. ఆన్​లైన్ గేమింగ్ సమయంపై పరిమితులు(china online games limit) విధించింది. మైనర్లు ఇకపై శుక్ర, శని, ఆదివారాల్లోనే ఆన్​లైన్ గేమ్స్ ఆడుకునే వీలు ఉంటుంది. అది కూడా రోజుకు.. రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యే.

ఇలా ఆన్​లైన్ గేమ్స్ ఆడుకునే సమయాన్ని వారానికి మూడు గంటలకే పరిమితం చేస్తూ నిబంధన తీసుకొచ్చింది చైనా సర్కారు. సెప్టెంబర్ 1 నుంచి ఈ రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు నేషనల్ ప్రెస్ అండ్ పబ్లికేషన్ అడ్మనిస్ట్రేషన్ నోటీసులో వెల్లడైంది.

ఇలాంటి నిబంధనలు 2019లోనే తీసుకొచ్చింది చైనా. దీని ప్రకారం వీకెండ్ రోజుల్లో గంటన్నర, పబ్లిక్ హాలీడే రోజుల్లో మూడు గంటలు ఆడుకునే వీలుంది. అయితే, తాజా నిబంధనల ప్రకారం వీకెండ్​తో పాటు సెలవు రోజుల్లోనూ ఆడుకునే సమయం గంటకే పరిమితం కానుంది.

షేర్లు పతనం

తాజా నిబంధనలు గేమింగ్ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయి. ప్రముఖ టెక్నాలజీ సంస్థలైన టెన్సెంట్, నెట్​ఈజ్​(netease games)లపై ఈ ప్రభావం ప్రత్యక్షంగా కనిపించింది. న్యూయార్క్​లో లిస్ట్ అయిన నెట్​ఈజ్ స్టాక్.. సోమవారం ట్రేడింగ్​ ఆరంభంలోనే 9శాతం(netease share price) పడిపోయింది. హాంకాంగ్​ మార్కెట్​లో టెన్సెంట్ షేరు 0.6 శాతం(tencent share price) పడిపోయింది. అయితే, మార్కెట్ ముగిసిన తర్వాత ఈ ప్రకటన వచ్చిన నేపథ్యంలో టెన్సెంట్​ షేర్లపై ప్రభావం పెద్దగా కనిపించలేదు.

అంతకుముందు, టెన్సెంట్ సంస్థ స్వయంగా చిన్నారులపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. మైనర్లకు రోజుకు గంట, సెలవు రోజుల్లో రెండు గంటలు మాత్రమే ఆడుకునే వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది. 12 ఏళ్ల లోపు వారికి గేమ్​లలో కొనుగోళ్లు జరపకుండా నిషేధం విధించింది.

ఆంక్షలకు కారణం!

సాంకేతిక సంస్థలను అణగదొక్కడంలో భాగంగానే ఈ ఆంక్షలు తీసుకొచ్చినట్లు నిపుణులు ఆరోపిస్తున్నారు. గతంలోనూ ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంది చైనా. పోటీతత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొంటూ ఈ-కామర్స్, ఆన్​లైన్ ఎడ్యుకేషన్ సంస్థలపై ఆంక్షలు విధించింది. లాభాపేక్షతో నడుస్తున్న ఎడ్యుకేషన్ సంస్థలపై గత నెలలోనే నిషేధం విధించింది.

ఇదీ చదవండి: టాటూగా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్.. యువకుడి వింత ఆలోచన!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.