ETV Bharat / international

చైనా రక్షణ బడ్జెట్​ పెంపునకు కరోనా బ్రేక్!

కరోనా సంక్షోభం చైనా రక్షణ బడ్జెట్​పై ప్రభావం చూపింది. గతేడాది బడ్జెట్​తో పోలిస్తే ఈ సారి బడ్జెట్​ పెంపును భారీగా తగ్గించింది. ఈ ఏడాది రక్షణ రంగం కోసం 179 బిలియన్​ డాలర్లు ఖర్చు చేస్తున్నట్లు జాతీయ పీపుల్స్ కాంగ్రెస్​లో ప్రవేశపెట్టిన ముసాయిదాలో పేర్కొంది ప్రభుత్వం.

CHINA-DEFENCE-BUDGET
చైనా రక్షణ బడ్జెట్​
author img

By

Published : May 22, 2020, 12:44 PM IST

రక్షణ రంగంపై ఖర్చు విషయంలో అమెరికా తర్వాతి స్థానంలో ఉంది చైనా. అయితే ఈ ఏడాది రక్షణ బడ్జెట్​ను పెంపును భారీగా తగ్గించింది. గతేడాదితో పోలిస్తే 1.4 బిలియన్ డాలర్లు మాత్రమే పెంచి 179 బిలియన్ డాలర్లకు పరిమితం చేసింది.

కొన్నేళ్లుగా పరిశీలిస్తే ఇదే అత్యల్ప పెరుగుదల అని విశ్లేషకులు చెబుతున్నారు. కరోనా సంక్షోభం కారణంగా చైనా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినటం వల్ల రక్షణకు భారీగా ఖర్చుపెట్టలేకపోయిందని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది.

20 లక్షల మంది సైనికులతో ప్రపంచంలో అతిపెద్ద మిలిటరీగా చైనా ఉంది. ఐదేళ్లుగా చైనాలో రక్షణ బడ్జెట్​ వృద్ధి రేటు సింగిల్ డిజిట్​కే పరిమితమవుతోంది. 2020లోనూ 6.6 శాతానికి తగ్గిస్తున్నట్లు చైనా పేర్కొంది. ఈ మేరకు జాతీయ పీపుల్స్ కాంగ్రెస్​లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ముసాయిదా నివేదికలో స్పష్టం చేసింది.

భారత్​కు 3 రెట్లు..

ముసాయిదా ప్రకారం.. గతేడాది రక్షణ రంగానికి 177.61 బిలియన్​ డాలర్లు కేటాయించగా.. ప్రస్తుతం 1.27 ట్రిలియన్ యువాన్లు (179 బిలియన్ డాలర్లు) ప్రతిపాదించింది. ఈ మొత్తం భారత్​ రక్షణ బడ్జెట్​కు మూడు రెట్లు అధికం.

అమెరికాతో పోల్చి చూసినప్పుడు చైనా వెచ్చిస్తున్నది చాలా తక్కువ. 2019 గణాంకాలను పరిశీలిస్తే అగ్రరాజ్యంతో పోలిస్తే నాలుగో వంతు చైనా ఖర్చు చేస్తోంది. ఒక్కొక్కరిపై వెచ్చించే ఖర్చును పోలిస్తే పదిహేడో వంతు మాత్రమే.

పారదర్శకతతో..

ముసాయిదాపై స్పందించిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఝాంగ్​ యెసూయి.. చైనా రక్షణ రంగ బడ్జెట్​లో పారదర్శకత ఉండదన్న విమర్శలను కొట్టిపారేశారు.

"చైనా రక్షణ బడ్జెట్​లో దాచడానికి ఏమీ లేదు. 2007 నుంచి ఏటా రక్షణ వ్యయానికి సంబంధించి నివేదికను అమెరికాకు అందిస్తున్నాం. డబ్బు ఎలా వస్తోంది.. దేనికి ఎంత ఖర్చు చేస్తున్నాం.. అన్నింటి వివరాలు అందిస్తున్నాం. రక్షణ బడ్జెట్ చైనా జీడీపీలో 1.3 శాతం. ప్రపంచ సగటుతో పోలిస్తే 2.6 శాతం."

- ఝాంగ్ యెసూయి

అయితే స్టాక్​హోం అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ (ఎస్​ఐపీఆర్​ఐ) అంచనాల ప్రకారం 2019లో చైనా రక్షణ రంగ బడ్జెట్ 232 బిలియన్ డాలర్లు. అధ్యక్షుడిగా షీ జిన్​పింగ్​ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సైన్యంలో భారీగా సంస్కరణలకు తెరతీశారు. విదేశాలపై పట్టు సాధించేందుకు సైనికుల సంఖ్యను తగ్గించి నావికా దళం, వాయుసేనలను శక్తిమంతంగా తీర్చిదిద్దారు.

ఇదీ చూడండి: 'దశాబ్దాలు గడుస్తున్నా చైనా దోపిడీలో మార్పుల్లేవు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.