ETV Bharat / international

చైనా సర్కారు 'అబార్షన్ల' నిర్ణయంపై సర్వత్రా విమర్శలు - అబార్షన్ల రేటుపై చైనా

అబార్షన్ల రేటు తగ్గించాలంటూ చైనా సర్కారు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయం తమ వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో జోక్యం చేసుకోవడమేనని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

china
చైనా అబార్షన్లు
author img

By

Published : Sep 29, 2021, 5:28 AM IST

అబార్షన్ల రేటు తగ్గించాలంటూ చైనా సర్కారు తీసుకున్న నిర్ణయం ప్రజాగ్రహానికి కారణమవుతోంది. మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రయత్నాల్లో భాగంగా అబార్షన్ల రేటును తగ్గిస్తామని చైనా స్టేట్ కౌన్సిల్ సోమవారం తెలిపింది. అయితే.. ప్రభుత్వ నిర్ణయాన్ని ముగ్గురు పిల్లల పాలసీలో భాగంగా జననాల సంఖ్యను పెంచేందుకు తీసుకున్న చర్యగా చైనీయులు భావిస్తున్నారు.

ప్రభుత్వ నిర్ణయం తమ వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో జోక్యం చేసుకోవడమేనని చాలా మంది విమర్శిస్తున్నారు. అధిక జనాభా వద్దని భావించినప్పుడు చిన్న కుటుంబమే మేలని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు జననాల రేటును పెంచేందుకు మహిళల ఆరోగ్యాన్ని సాకుగా చూపుతూ అబార్షన్లు వద్దని చెబుతోందని ఆరోపిస్తున్నారు. గతంలో రెండో సంతానం కావాలనుకున్న వారిచేత బలవంతంగా అబార్షన్లు చేయించిన ప్రభుత్వం ఇప్పుడు ఆరోగ్యం పేరిట అబార్షన్లను తగ్గించేందుకు యత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం హాస్యాస్పదంగా ఉందని విమర్శిస్తున్నారు.

ఇదీ చదవండి:

చేతిలో చెయ్యేసి... నిమిషం వ్యవధిలో భార్యాభర్తలు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.