దక్షిణ చైనాలోని సిచువాన్ రాష్ట్రంలో భూకంపం విధ్వంసం సృష్టించింది. భూకంప లేఖినిపై 6.0 తీవ్రత నమోదయ్యింది. ఈ ప్రమాదంలో 11 మంది మరణించారు. మరో 12ం మందికి పైగా గాయపడ్డారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
హుటాహుటిన తరలిన 300 మంది సహాయక సిబ్బంది రక్షణ చర్యల్లో పాల్గొన్నారు.
భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10.55 గంటలకు భూకంపం సంభవించింది. 16 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్టు చైనా అధికారులు తెలిపారు. మూడు సార్లు సాధారణంగా కంపించిన భూమి మరో 41 నిమిషాల తర్వాత ఉగ్ర రూపం దాల్చింది. భూకంపానికి సంబంధించి ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
సిచువాన్ రాష్ట్రంలో తరచూ భూకంపాలు సంభవిస్తాయి. 2008లో 7.9 తీవ్రతతో వచ్చిన భూకంపంతో 87 వేల మంది మరణించారు.
ఇదీ చూడండి: ఎంపీలుగా ప్రమాణం చేసిన కేంద్ర మంత్రులు