ETV Bharat / international

ఆ దేశాలను ఎదుర్కొనేందుకు చైనా కొత్త తంత్రం!

తనపై విదేశాలు విధిస్తున్న ఆంక్షలను ఎదుర్కోవటానికి చైనా సమాయత్తమవుతోంది. ఇందుకోసం 'వోల్ఫ్​ వారియర్'​గా పిలిచే దౌత్య విధానాన్ని అనుసరించాలని యోచిస్తోంది. జీ7 సదస్సు ప్రారంభానికి కొన్నిరోజుల ముందే ఓ చట్టాన్ని కూడా ఆ దేశం తీసుకువచ్చింది. ఈ చర్యలతో అమెరికాతో పోరుకుసై అంటున్నట్లుగా చైనా కనిపిస్తోంది.

wolf warrior policy
చైనా ఫారిన్​ పాలసీ
author img

By

Published : Jun 20, 2021, 1:59 PM IST

చైనాను నియంత్రించాలని ఇటీవల జరిగిన జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సులో అమెరికా పిలుపునిచ్చిన నేపథ్యంలో... ఆ దేశాలను ఎదుర్కొనేందుకు చైనా సన్నద్ధమవుతోంది. 'వోల్ఫ్​ వారియర్​'గా పిలిచే దుందుడుకు దౌత్య విధానాన్ని ఇకపై అనుసరించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా తమపై ఆంక్షలను విధించకుండా విదేశాలను అడ్డుకోవాలని భావిస్తోంది.

సదస్సుకు ముందే ఆ చట్టం...

రెండేళ్లుగా జిన్​పింగ్​ తమ దౌత్యవేత్తలను పోరాట పంథాను అలవర్చుకోవాలని ఆదేశిస్తున్నారని జియాన్లీ యాంగ్​ అనే విశ్లేషకుడు 'న్యూస్​వీక్'​ అనే పత్రికకు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. అమెరికా-చైనా సంబంధాలు సహా అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవటంలో కఠిన వైఖరిని అవలంబించాలని సూచిస్తున్నట్లు తెలిపారు. ఈ వాదనలకు బలం చేకూర్చేలా.. ఇంగ్లాండ్​లో 47వ జీ7 సదస్సు ప్రారంభానికి ముందే.. ఓ కొత్త చట్టాన్ని చైనా పార్లమెంటు ఆమోదించింది. షింజియాంగ్​లో బలవంతపు కార్మిక విధానాలు, హాంకాంగ్​లో మానవ హక్కుల ఉల్లంఘనకు చైనా పాల్పడుతోందంటూ అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో... చైనాకు చెందిన పలు సంస్థలపై యూరోపియన్ యూనియన్​ దేశాలు ఆంక్షలను విధించాయి. ఈ క్రమంలో వాటిని ఎదుర్కొనేందుకు ఈ చట్టాన్ని చైనా తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

మార్పులు చేస్తారా?

మే 31న జరిగిన చైనా కమ్యూనిస్టు పార్టీ(సీసీపీ) సమావేశంలో.. అంతర్జాతీయంగా తమ గొంతుకను బలంగా వినిపించేలా అధికారులకు జిన్​పింగ్​ సూచించారు. అయితే అదే సమయంలో.. వినయం కూడా ప్రతిబింబించాలని తెలిపారు. జిన్​పింగ్​ మాటల ద్వారా.. 'వోల్ఫ్​ వారియర్'​ దౌత్య విధానానంలో జిన్​పింగ్​ కొన్ని మార్పులు చేయాలనుకుంటున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారని జియాన్లీ తన వ్యాసంలో పేర్కొన్నారు. జిన్​పింగ్​ ఈ మార్పులు చేయటంలో విఫలమైతే.. చైనాపై విదేశాల్లో వ్యతిరేకత ఇంకా పెరుగుతుందని చెప్పారు.

చైనా తీసుకువచ్చిన తాజా చట్టంతో.. అమెరికాలోని బహుళ జాతి సంస్థలకు నష్టమే అయినప్పటికీ.. అది మరింత వైరానికి దారి తీయవచ్చని 'న్యూస్​ వీక్​' తెలిపింది. చైనాతో పోరుకు అమెరికాను మరింత రెచ్చగొట్టవచ్చని పేర్కొంది. జీ7 శిఖరాగ్ర సదస్సుకు ముందు హడావుడిగా ఈ చట్టాన్ని తీసుకువచ్చిన చైనా ప్రభుత్వం చర్యలు.. అమెరికాతో కయ్యానికి కాలు దువ్వుతున్నట్లు కనపిస్తోందని తెలిపింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.